వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక జియో ఫోన్లు బంద్‌.. జియో కొత్తఎత్తుగడ, ఏమిటంటే..

ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో ఇపుడు తన గేమ్‌ప్లాన్‌ను మార్చింది. ఉచిత ఆండ్రాయిడ్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్‌ జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టెలికాం మార్కెట్‌లో ప్రధాన పోటీదారులైన ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌లకు షాకిచ్చేలా జియో పావులు కదుపుతోంది.

ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో ఇపుడు తన గేమ్‌ప్లాన్‌ను మార్చింది. ఉచిత ఆండ్రాయిడ్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

jio-android-phone

ముఖ్యంగా జియో ఫీచర్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లాంటి సోషల్‌మీడియా సైట్ల సపోర్టు లేకపోవడంతో తాజాగా ఆండ్రాయిడ్‌ ఫోన్లను ఉచితంగా అందించనుందని సమాచారం. అన్ని సోషల్‌ మీడియా యాప్‌ల మద్దతుతో ఈ ఉచిత ఆండ్రాయిడ్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జియో ఫీచర్‌ ఫోన్‌ ఉత్పత్తిని నిలిపివేసి ఆండ్రాయిడ్‌ ఫోన్ల తయారీపై దృష్టి కేంద్రీకరించిందనీ ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఫేస్‌బుక్‌, గూగుల్‌లాంటి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టినట్టు నివేదించింది.

మరోవైపు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అంచనాలను జియో ప్రతినిధి తిరస్కరించలేదు..కానీ, త్వరలోనే జియో ఫోన్ బుకింగ్ తేదీని ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇండియా కా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా డిజిటల్‌ ఇండియాకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.

జియో ఫోన్‌ బుక్‌ చేసుకున్న 60 లక్షల భారతీయులను స్వాగతించిన ఆయన జియోఫోన్ తదుపరి బుకింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.

English summary
Reliance Jio, the fastest growing phone services company in the world, has stopped production of the current crop of JioPhones and is in talks to bring out an Android-based phone, three sources have confirmed. Currently, the JioPhone runs on KaiOS, an operating system that is a version of the Firefox OS. Jio, which counts over 100 million customers, seems to be having a rethink of its strategy of developing applications and offering services on this OS platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X