కుమారుడి పెళ్లికి డీఎంకే ఛీఫ్ స్టాలిన్ను ఆహ్వానించిన ముఖేష్ అంబానీ
చెన్నై: ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట్లో మరోసారి పెళ్లి బాజా మోగనుంది. ముఖేష్ అంబానీ కూతురు వివాహం జరిగిన కొద్ది రోజులకే మరో గ్రాండ్ వెడ్డింగ్ ముఖేష్ ఇంట జరగనుంది. అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వివాహం త్వరలోనే జరగనుంది. ఇందుకోసం ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు వెడ్డింగ్ కార్డులు ఇవ్వడం ప్రారంభించారు.
ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతాను పెళ్లాడనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే అతిథులను పెళ్లికి ఆహ్వానం పలికేందుకు ముఖేష్ కుటుంబసభ్యులందరూ కదిలారు. ముందుగా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముఖేష్ అంబానీ దంపతులు చెన్నైకి వెళ్లారు. అక్కడ డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ను కలిసి తన కుమారుడి వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు స్టాలిన్ను కలిసిన ఫోటోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు స్టాలిన్.

ఇదిలా ఉంటే ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం వచ్చే నెలలో జరగనుంది. చిన్ననాటి స్నేహితులైన ఆకాష్, శ్లోకాలకు గతేడాది జూలైలో నిశ్చితార్థం జరిగింది. ఇషా అంబానీ నిశ్చితార్థ కార్యక్రమంలో ఆకాష్ శ్లోకాలు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. అంతేకాదు ఇద్దరూ కలిసి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ వేసి అతిథులను ఆకట్టుకున్నారు. శ్లోకా మెహతా వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కూతురు. ఇక ఇషా అంబానీకి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. వీరికోసం అంబానీ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. మరి ఆకాష్ అంబానీ వివాహం ఏ రేంజ్లో చేస్తారో చూడాల్సిందే.
It was a pleasure to receive a courtesy call from Thiru Mukesh Ambani, Chairman Reliance Industries Limited, in Chennai earlier this evening. pic.twitter.com/acjKFLjzX9
— M.K.Stalin (@mkstalin) February 11, 2019
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!