వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబానీ ఫ్యామిలీనే ఆసియా టాప్: ఫోర్బ్స్ సంపన్న జాబితా ఇదే

భారత కుబేరుడు, రిలయన్స్‌ గ్రూప్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ మరోసారి ఫోర్బ్స్ జాబితాలో సత్తా చాటాడు. గత కొన్నేళ్లుగా ఫోర్బ్స్‌ జాబితాలో ఆయనదే అగ్రస్థానం ఉన్న విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత కుబేరుడు, రిలయన్స్‌ గ్రూప్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ మరోసారి ఫోర్బ్స్ జాబితాలో సత్తా చాటాడు. గత కొన్నేళ్లుగా ఫోర్బ్స్‌ జాబితాలో ఆయనదే అగ్రస్థానం ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు అంబానీ కుటుంబం కూడా ఆసియాలోనే ధనిక కుటుంబంగా నిలిచింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది.

పిప్ లీని వెనక్కి నెట్టిన అంబానీ ఫ్యామిలీ

పిప్ లీని వెనక్కి నెట్టిన అంబానీ ఫ్యామిలీ

ఫోర్బ్స్ తాజాగా వెల్లడించిన జాబితాలో.. దక్షిణకొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ అధిపతి పిప్ లీ కుటుంబాన్ని వెనక్కి నెట్టిన అంబానీ కుటుంబం.. సంపన్నుల జాబితాలో అగ్రస్థానం సంపాదించింది.

బిలియన్ డాలర్ల ఆస్తులు

బిలియన్ డాలర్ల ఆస్తులు

ముకేష్ అంబానీ కుటుంబ ఆదాయం 19 బిలియన్‌ డాలర్లు పెరిగి 44.8 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా.. లీ కుటుంబ ఆదాయం 11.2 బిలియన్‌ డాలర్లు పెరిగి 40.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

టాప్-10లో ఏకైక భారతీయ కుటుంబం

టాప్-10లో ఏకైక భారతీయ కుటుంబం

ఆసియా ధనిక కుటుంబ జాబితాలో టాప్‌ 10 స్థానాల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారత కుటుంబం ముఖేశ్‌దే కావడం విశేషం. కాగా, 40.4 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో హాంకాంగ్‌కు చెందిన క్వోక్‌ ఫ్యామిలీ మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా.. 36.6 బిలియన్‌ డాలర్ల సంపదతో థాయిలాండ్‌కు చెందిన ఛెరావనోత్‌ కుటుంబం నాలుగో స్థానంలో ఉంది.

జాబితాలో సంపన్న భారత కుటుంబాలివే..

జాబితాలో సంపన్న భారత కుటుంబాలివే..

అజీమ్‌ ప్రేమ్‌జీ (11వ ర్యాంకు, 19.2 బిలియన్‌ డాలర్లు), హిందూజా(12వ ర్యాంకు, 18.8బిలియన్‌ డాలర్లు), మిట్టల్‌ (14వ ర్యాంకు, 17.2 బిలియన్‌ డాలర్లు), మిస్త్రీ( 16వ ర్యాంకు, 16.1 బిలియన్‌ డాలర్లు), బిర్లా(19వ ర్యాంకు, 14.1 బిలియన్‌ డాలర్లు) ఫోర్బ్స్‌ జాబితాలో ఉన్నారు. కాగా, ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఆసియా ధనిక కుటుంబాలు- 2017 జాబితాలో భారత్‌కు చెందిన 18 కుటుంబాలు స్థానం సంపాదించడం గమనార్హం. స్టాక్‌ విలువ, కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ విలువను పరిగణలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.

English summary
Mukesh Ambani family is the richest in Asia as its net worth rose $19 billion to $44.8 billion, toppling the Lees of the Samsung empire, to claim the numero uno position, Forbes said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X