వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేగుతోన్న దుమారం!: అంబేడ్కర్‌పై బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ బన్సాల్ 'డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత కాదు' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

జైపూర్: బాబా సాహెబ్ అంబేడ్కర్ 126వ జయంతి ఉత్సవాల సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంబేడ్కర్ గౌరవాన్ని మసకబార్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

రాజస్థాన్ లోని భరత్ పుర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ బన్సాల్ 'డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత కాదు' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలే ఆయనను అలా మార్చేశాయని అన్నారు. అయితే అంబేడ్కర్ తెలివైన వ్యక్తి అని, అందులో ఎలాంటి సందేహం లేదన్న ఆయన.. బాబూ రాజేంద్రప్రసాద్ చైర్మన్ గా ఉన్న రాజ్యాంగ కమిటీలో అంబేడ్కర్ ఒక సభ్యుడు మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు.

BJP

విజయ్ బన్సాల్ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది. ఇప్పటికే అంబేడ్కర్ ఐడియాలజీకి, బీజేపీకి మధ్య తీవ్ర అగాథం ఉండటంతో.. ఆయన్ను ఎలా తమ పార్టీకి అన్వయించుకోవాలా? అని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అదే పార్టీకి చెందిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టినట్లే.

అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలు కేవలం అతని వ్యక్తిగతమని చెబుతోంది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఇదే అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

English summary
A Bharatiya Janata Party (BJP) legislator from Rajasthan said BR Ambedkar was not the architect of the Indian Constitution and that vote bank politics made him so on Friday, the day when political leaders, including Prime Minister Narendra Modi, paid glowing tributes to the Dalit icon on his 126th birth anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X