వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ చట్టానికి సవరణతో మరింత పదును: దుర్వినియోగమవుతుందా?

పన్ను ఎగవేతదారుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదాయపుపన్ను(ఐటీ) చట్టానికి సవరణలతో మరింత పదును పెడుతోంది. దీంతో పన్ను ఎగవేతదారులు ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదాయపుపన్ను(ఐటీ) చట్టానికి సవరణలతో మరింత పదును పెట్టింది. దీంతో పన్ను ఎగవేతదారులు ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ అక్రమ సొమ్ముకు పన్నులను ఎగ్గొట్టేందుకు కొత్తదారులు వెతికే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎకనామిక్స్ టైమ్స్‌లో ఓ కథనం ప్రచురితమైంది.

ఆ కథనం ప్రకారం.. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా పోగుబడిన అక్రమ సొమ్మును పన్నుఎగవేతదారులు బదలాయించే పనిలో పడ్డారు. స్నేహితుల వద్ద నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నామని, బంగారమంతా తమ అమ్మమ్మతాతయ్యల నుంచి వచ్చిందని, చిన్న వ్యాపారుల నుంచి కానుకలు వచ్చాయని, కూతురు వివాహానికి ఖర్చయిందని, ఇతర ఇంటి ఖర్చులకు వెచ్చించామని పన్నుదారులు చెబుతున్నారని ఓ టాక్స్ ఆఫీసర్ చెప్పడం గమనార్హం.

గతంలో 35శాతం ఉండి ఇప్పుడు 83శాతం పెరిగిన వ్యక్తి ఆదాయం లేదా ఖర్చులపై ఐటీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఐటీ శాఖ. అక్రమంగా కూడబెట్టిన నల్లడబ్బుకు చాలా మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించిన ఐటీ శాఖ.. ఐటీ చట్టానికి పదును పెట్టే పనిలో పడిందని చెప్పారు. అయినప్పటికీ పన్నుఎగవేతదారులు కొత్త మార్గాలు వెతికే అకాశం ఉందని చెప్పారు.

Amended I-T law harsh, prone to misuse by taxmen: Experts

పెద్ద నోట్ల రద్దు అనంతరం ఐటీ చట్టానికి మరింత పదును పెట్టినట్లు ఆయన తెలిపారు. దీంతో పన్నుఎగవేతదారులు తప్పని పరిస్థితుల్లో తమ ఆస్తికి సంబంధించిన వివరాలున తెలపాల్సి వస్తుందని, అలాగే పన్ను కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

ఈ కారణంగానే పన్ను ఎగవేతదారులు ఆందోళన చెందుతున్నారని, ఇతర అక్రమ మార్గాలను అన్వేషిస్తూ పన్ను ఎగవేతకు యత్నిస్తున్నట్లు గుర్తించామన్నారు. అంతేగాక, నిపుణులైన సీఏలను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటి వరకు పన్ను చెల్లించని అక్రమ సొమ్ముకు భారీగా జరిమానా విధిస్తున్నామని తెలిపారు. అలాగే సక్రమంగా పన్ను చెల్లింపు చేసేవారికి ఎలాంటి వేధింపులు ఉండవని స్పష్టం చేశారు.

English summary
As the dust begins to settle on demonetization and the taxman hunts for unexplained money, there is a lurking concern among practitioners and senior levels of the tax office as to how harshly the new law would be used.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X