వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా సైన్యం నోట ‘జన గణ మన’.. సోషల్ మీడియాలో వీడియో వైరల్...(వీడియో)

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : మన జాతీయ గీతం.. జన గణ మన.. వినగానే ప్రతి భారతీయుడు లేచి నిల్చొని సెల్యూట్ చేస్తారు. జాతీయ జెండాకు వందనం చేసి ఎలుగెత్తి సగర్వంగా ఆలపిస్తారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ఆలపిస్తే ..ఫరవాలేదు .. కానీ అమెరికా సైనికులు పాడితే .. అఖండ భారతవని ఉప్పొంగిపోతుంది. అలాంటి ఘటన యుధ్ అభ్యాస్ 2019లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతుంది.

యుధ్ అభ్యాస్‌లో జన గణ మన

యుధ్ అభ్యాస్‌లో జన గణ మన

భారత్-అమెరికా రక్షణపరమైన సమన్వయానికి మరింత బలోపేతం చేసేందుకు 'యుధ్ అభ్యాస్ 2019' నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ లూయీస్ మెక్‌కార్డ్ వేదికగా ప్రారంభమై 18వ తేదిన ముగిసింది. ఈ క్రమంలో గత వారం అసోం రెజిమెంటల్ మార్చింగ్ పాట ‘బద్దూరామ్ కా బదన్' కాలు కదిపి అమెరికా జవాన్లు స్టెప్పు వేశారు. ఈ సారి జన గణ మన ఆలపించారు. అమెరికా సైన్యం ‘జన గణ మన' అలపిస్తున్న వీడియో చూసి ప్రతి భారతీయుడు మది పులకిస్తోంది.

వీడియో వైరల్

సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది. వీడియో నిడివి ఒక్క నిమిషం ఒక సెకన్ ఉంది. ఆ వీడియో చూసి భారతీయులు గర్వంగా ఫీలవుతున్నారు. అమెరికా సైనికులు హ్యాట్సాప్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు యుధ్ అభ్యాస్‌లో సైనికులు మాక్ డ్రిల్ నిర్వహించారు. వారి మాక్ డ్రిల్ కూడా తెగ ఆకట్టుకుంది.

ఇదీ నేపథ్యం ..

ఇదీ నేపథ్యం ..

‘బద్దూరామ్ కా బదన్' అసోం రెజిమెంట్ మార్చింగ్ పాట. దీనికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగేప్పుడు జపాన్‌తో జరిగిన పోరాటంలో బద్దూరామ్ అనే సైనికుడు వీరమరణం పొందారు. ఆ సమయంలో సైనికులకు ఆహారం రేషన్ రూపంలో వచ్చేది. బద్దూరామ్ చనిపోయాడనే విషయాన్ని రెజిమెంట్ అధికారి తెలియజేయలేదు. దీంతో అతని రేషన్ కూడా రెజిమెంట్‌కు వచ్చేది. అదనంగా వచ్చిన రేషన్ యుద్ధం చివరలో గెలుపు ఓటములను శాసించిన సంగతి తెలిసిందే.

English summary
Every Indian gets up and salutes when the Jana Gana hears us. If the US soldiers sung .. One such event took place in 2019, the Yudh abyas. The video goes viral with the sharing of social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X