• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అగ్రరాజ్య అధినేత ట్రంప్‌కు స్వాగతం.?: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ టు ఆగ్రా వరకు, షెడ్యూల్ వివరాలివే..

|

మరికొన్నిగంటల్లో అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకోనున్నారు. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. తన సతీమణి మెలానియా, కూతురు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌ సహా ప్రతినిధుల బ‌ృందంతో వస్తోన్నారు. ట్రంప్ భారత పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 'ఇది మనకు అతిపెద్ద ఘటన, దేశ ప్రజలతోపాటు నేను కూడా ట్రంప్ రాక కోసం ఎదురుచూస్తున్నాను అని' మోడీ ట్వీట్ చేశారు.

  Namaste Trump: Trump's Road Show From Airport To Motera Stadium | Oneindia Telugu

  ట్రంప్ భారత్ పర్యటన: ఐటీసీ మౌర్య హోటల్‌లో బస... ఒక్క రాత్రికి ఈ గది ధర ఎంతో తెలుసా..?

  ట్రంప్ క్యురియాసిటీ..

  ప్రధాని మోడీ ఎంత ఉత్సాహాంతో ఉన్నారు. ట్రంప్ కూడా అంతే క్యురియాసిటీతో కనిపించారు. సూపర్ హిట్ మూవీ బాహుబలిలో హీరో స్థానంలో మార్పింగ్ చేసిన తన ఫోటోతో ట్రంప్ ఆదివారం షేర్ చేసిన సంగతి తెలిసిందే. భారతదేశ గొప్ప స్నేహితులను కలుసుకోబోతున్నానని ట్రంప్ అందులో రాసుకొచ్చారు. మరోవైపు ఇవాంకా ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. 2018లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూస్ షిప్ సమ్మిట్ కోసం వచ్చిన తాను.. తిరిగి రెండేళ్ల తర్వాత వస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే రెండు అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశాలు మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఇది దోహదపడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

  వెల్ కం మిత్రమా..

  గుజరాత్ సీఎం విజయ్ రూపానీ పోస్ట్ చేసిన వీడియో ప్రధాని మోడీ షర్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత దేశం సగర్వంగా స్వాగతం చెబుతోంది. సోమవారం ట్రంప్ మనతో పర్యటించబోతున్నారు. ట్రంప్ చారిత్రక పర్యటన అహ్మదాబాద్‌తో ప్రారంభమవుతోంది అని' ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తొలిసారి ఇండియా వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

  ఇదీ షెడ్యూల్..

  ఇదీ షెడ్యూల్..

  అహ్మదాబాద్‌తో ట్రంప్ భారతదేశ పర్యటన ప్రారంభమవుతోంది. అక్కడినుంచి నేరుగా ఆగ్రా తర్వాత న్యూఢిల్లీ వెళతారు. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా భారతదేశం సంస్కృతి, సాంపద్రాయాలకు మరింత ఔన్నత్యం రానుంది.

  హౌడీ మోడీ-నమస్తే ట్రంప్

  హౌడీ మోడీ-నమస్తే ట్రంప్

  అంతకుముందు విమానాశ్రయం నుంచి మొతేరా స్టేడియం వరకు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో గుండా ట్రంప్‌ను దాదాపు 70 లక్షల మంది ప్రజలు తిలకించే అవకాశం ఉంది. మార్గమధ్యంలో 20 స్టేజీలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడినుంచి నేరుగా మోతేరా స్టేడియానికి వెళతారు. అక్కడ ‘నమస్తే ట్రంప్' కార్యక్రమం నిర్వహిస్తారు. ఇదివరకు అమెరికాలో నిర్వహించిన ‘హౌడీ మోడీ' లాగా నమస్తే ట్రంప్ కార్యక్రమం ఉండనుంది.

  English summary
  US President Donald Trump left for a two-day visit to India on Sunday with an upbeat remark, saying he was told by his "friend", Prime Minister Narendra Modi.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X