వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెథీ రైఫిల్ యూనిట్ తో ఉపాధి .. మరింత శక్తిమంతంగా భారత రక్షణరంగం: వ్లాదిమిర్ పుతిన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచే పెద్దన్న రష్యా .. మన దేశాన్ని కొనియాడింది. రక్షణ రంగ ఉత్పత్తుల విషయంలో కొనసాగుతోన్న భాగస్వామ్యం మరింత ముందుకు సాగుతోందని అభిప్రాయపడింది. ఆదివారం అమేథిలో శంకుస్థాపన చేసిన రైఫిల్ ఫ్యాక్టరీతో యువతకు ఉపాధి లభిస్తోందని .. అలాగే భారతదేశ రక్షణరంగానికి మరింత ఊతమిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేఖ రాశారు.

ఫ్యాక్టరీతో ఉద్యోగాల కల్పన

ఫ్యాక్టరీతో ఉద్యోగాల కల్పన

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న అమేథి నియోజకకవర్గంలో ఏకే 203 రైఫిల్ ఉత్పత్తి కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఆదివారం జరిగిన సభలో ప్రధాని మోదీ .. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ భాగస్వామ్య దేశం రష్యా నుంచి ప్రశంసలు రావడం శుభపరిణామం. రైఫిల్ ఫ్యాక్టరీతో ఆధునాతన సాంకేతిక పరికరాలు పొందనట్లవుతోందని, అలాగే యువతకు ఉపాధి కల్పన జరుగుతోందని తన లేఖలో పేర్కొన్నారు పుతిన్.

ఆధునిక పరకరాల తయారీ

ఆధునిక పరకరాల తయారీ

అమేథిలో నెలకొల్పే రైఫిల్ ఫ్యాక్టరీలో 200 సిరీస్ లో ఆధునాతనమైన కలస్నికోవ్ రైఫిల్ తయారవుతాయని ప్రస్తావించారు. దీంతో జాతి ప్రయోజనాల కోసం చిన్న ఆయుధ తయారీలో రష్యా ఉపయోగించే ఆధునాతన పరిజానాన్ని భారతదేశ రక్షణరంగానికి కలుగుతోందని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు భారత రక్షణ బలగాలు చిన్న ఆయుధాల అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. భారత్ తో రష్యా సైనిక, సాంకేతిక విభాగంలో దశాబ్ధాలుగా భాగస్వామ్యం కొనసాగుతోందని గుర్తుచేశారు. ఇప్పటికే భారత్ లో 170క పైగా సంస్థలను నెలకొల్పామని ప్రత్యేకంగా ప్రస్తావించారు పుతిన్

 రష్యా సహకారానికి ధన్యవాదాలు

రష్యా సహకారానికి ధన్యవాదాలు

అమేథిలో నెలకొల్పే రైఫిల్ ఫ్యాక్టరీ రష్యా సహాయ సహకారాలను మరవలేమన్నారు ప్రధాని మోదీ. రైఫిల్ ఫ్యాక్టరీలో ఆధునికమైన ఏకే 203 రైఫిల్ ను కూడా రూపొందిస్తామని పేర్కొన్నారు. రష్యా-భారత్ సంయుక్త సహకారంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుతో రక్షణరంగ అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు చేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారాయన. ఈ సందర్భంగా తమకు తోడ్పాటును అందించడంలో కృషిచేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కృతజతలు తెలిపారు. రష్యా సహకారంతోనే ఈ ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తవుతోందని విశ్వాసం వ్యక్తంచేశారు.

గతేడాది ఒప్పందం .. 7 లక్షల రైఫళ్ల తయారీ

గతేడాది ఒప్పందం .. 7 లక్షల రైఫళ్ల తయారీ

గతేడాది రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ వచ్చిన సందర్భంగా రైఫళ్ల కర్మాగారానికి సంబంధించి ఒప్పందం జరిగింది. ఈ ఫ్యాక్టరీలో 7 లక్షల రైఫిళ్లను తయారుచేసే సామర్త్యం ఉన్నది. ప్రస్తుతం భారత భద్రతాదళాలు వాడుతున్న ఇన్సాప్ రైఫిళ్ల స్థానంలో వీటిని ఉపయోగించనున్నారు.

English summary
prime Minister Narendra Modi launched the AK-203 rifle manufacturing unit in Amethi on Sunday, Russian President Vladimir Putin wrote a note to Indians saying the country's needs of national security will be fulfilled with the advanced Russian technologies and also create new jobs. Putin wrote in his note, "The new joint venture will manufacture world famous Kalashnikov assault rifles of the newest 200 series and eventually will reach full localization of production.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X