వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో భారీగా వైఎస్ జగన్ పోస్టర్లు.. కొత్త రాజకీయ పార్టీకి ఆదర్శం.. ఆ హీరోనే సీఎం అంటూ..

|
Google Oneindia TeluguNews

బార్న్ విత్ సిల్వర్ స్ఫూన్ అయిఉండీ.. జైలులో చిప్పకూడు తినాల్సి వచ్చినా.. అవినీతి కేసుల్లో నెలల తరబడి కటకటాల వెనుకే ఉండిపోయినా.. ఎండావానల్ని లెక్కచేయకుండా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా.. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనూ ఉక్కిరిబిక్కిరికి గురైనా.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రత్యర్థులు సైతం మెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Recommended Video

Thalapathy Vijay Birthday : Watch Jagan & Actor Vijay Posters In TN || Oneindia Telugu

సంకీర్ణ యుగంలో ప్రాంతీయ పార్టీల హవా నానాటికీ పెరుగుతోన్న నేపథ్యంలో.. భవిష్యత్తులో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పుట్టుకురాబోయే కొత్త రాజకీయ పార్టీలకు జగన్ అనుభవం కచ్చితంగా పరిశీలనాశమేనని పొలిటికల్ అనలిస్టులూ చెబుతుంటారు. సరిగ్గా ఇదే విషయాన్ని ప్రఖ్యాత హీరో అభిమానులు సైతం వక్కాణిస్తున్నారు...

ఇరకాటంలో మోదీ.. జగన్, కేసీఆర్ బాసట.. రాత్రికిరాత్రే కీలక ప్రకటనలు.. చైనా హింస నేపథ్యంలోఇరకాటంలో మోదీ.. జగన్, కేసీఆర్ బాసట.. రాత్రికిరాత్రే కీలక ప్రకటనలు.. చైనా హింస నేపథ్యంలో

భారీ ఎత్తున పోస్టర్లు..

భారీ ఎత్తున పోస్టర్లు..

విడదీయలేనంత గాఢంగా సినిమాలు, రాజకీయాలు పెనవేసుకుపోయిన తమిళనాడులో.. పలువురు నటులు ముఖ్యమంత్రులుగానూ పనిచేయగా, ఇంకొందరు చక్రం తిప్పే స్థాయికి ఎదిగిన వైనం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడు ‘తళపతి' విజయ్. ఈనెల 22న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన పోస్టర్లు, చేస్తోన్న ప్రకటనలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీ సీఎం జగన్ తో విజయ్ కలిసున్నట్లుగా రూపొందిన పోస్టర్ల ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రధానంగా దక్షిణ తమిళనాడు అంతటా ఈ తరహా పోస్టర్లు వెలిశాయి.

జగన్ ఆదర్శంగా..

జగన్ ఆదర్శంగా..

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మాదిరిగా తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టి, ఘన విజయం సాధించబోతున్నారని.. తమిళనాడును పరిపాలించేందుకు ఆయన రాబోతున్నారంటూ విజయ్ ఫ్యాన్స్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ పట్టుపట్టడం ఇది కొత్తేమీ కానప్పటికీ.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది. విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చేలా ఒప్పించాలంటూ ఆయన తండ్రి, సీనియర్‌ దర్శకుడైన ఎస్‌ఏ చంద్రశేఖర్‌ పై అభిమానులు చాలా కాలంగా ఒత్తడి చేస్తుండటం తెలిసిందే.

కష్టాలు తీర్చేవాడిగా..

కష్టాలు తీర్చేవాడిగా..

‘‘ఏపీ సీఎం జగన్‌లా ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వాన్ని.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లా అవినీతిరహిత పాలనను.. కేరళ సీఎం పినరై విజయన్‌లా నిజాయితీతో ప్రభుత్వాన్ని విజయ్ అందిస్తారు.. ''అంటూ సదరు పోస్టర్లలో అభిమానులు రాసుకొచ్చారు. అయితే ఎక్కువ శాతం ఫొటోలు మాత్రం విజయ్-జగన్ లవే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫొటోలను కూడా జత చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ ఇళ్లు, ఆస్తులపై ఐటీ దాడులు జరిగిన సందర్భంలోనూ ఇవే తరహా పోస్టర్లు అక్కడక్కడా కనిపించడం తెలిసిందే.

పొలిటికల్ దుమారం..

పొలిటికల్ దుమారం..

విజయ్ రాజకీయ ఆగమనంపై తొలి నుంచీ చర్చ జరుగుతున్నా.. 2017లో ఆయన తీసిర ‘మెర్సెల్'(తెలుగులో అదిరింది) సినిమా తర్వాత అది మరింత వ్యాప్తిలోకి వచ్చింది. ఆ సినిమాలో విజయ్.. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాల్లోనూ రాజకీయ అంశాలను టచ్ చేస్తుండటం, వాటిపై దుమారం రేగుతుండటం పరిపాటిగా మారింది. అయితే కొత్త రాజకీయ పార్టీ స్థాపించే విషయమై విజయ్ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఏడాదిలో సాధ్యమేనా?

ఏడాదిలో సాధ్యమేనా?

2016లో వరుసగా రెండో సారి విజయం సాధించిన కొద్ది రోజులకే సీఎం జయలలిత కన్నుమూయడంతో తమిళనాట అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శశికళ వర్గం తిరుగుబావుటాతో అధికార ఏఐడీఎంకే పార్టీ ముక్కలుగా చీలిపోవడం.. కొద్దిరోజులకే కేంద్రం అడతో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటైపోయి సర్కారును స్థిరంగా నడిపిస్తుండం తెలిసిందే. ఎంకే స్థాలిన్ నేతృత్వంలోని ప్రతిపక్ష డీఎంకే గత లోక్ సభ ఎన్నికల్లో భారీగా సీట్లను కైవసం చేసుకుని.. 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు నిలుపుకుంది. ఇప్పటికే రజనీకాంత్, కమలహాసన్ లు రాజకీయ పార్టీలు స్థాపించి, కార్యకలాపాల్లో మునిగిపోయారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో విజయ్ కొత్త పార్టీ పెట్టి, రాణించడం సాధ్యమవుతుందా? అనేది చర్చనీయాంశమైంది.

English summary
On the occasion of thalapathy vijay birthday, his fans Put Up Posters With AP CM YS Jagan and demands to launch a new political party in Tamil nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X