• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిందూ మహసముద్రంలో చైనా యుద్ద ట్యాంకులు, యుద్దమేనా?

By Narsimha
|

న్యూఢిల్లీ: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం చోటుచేసుకొంటున్న తరుణంలోనే చైనా యుద్దనౌకలు హిందూమహసముద్రంలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో యుద్దానికి సంకేతాలా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

చైనీస్ యుద్ద నౌకలు అనుహ్యరీతిలో భారత్ కు ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో చక్కర్లు కొట్టడం ఉత్కంఠ కల్గిస్తోంది.సిక్కిం సరిహద్దులో నెలరోజులుగా ఇరుదేశాల ఆర్మీ మధ్య ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న భారత్ 1962 నాటి భారత్ కాదంటూ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. ఆ ప్రకటనపై చైనా కూడ అప్పటి చైనా కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గెంంగ్ షువాంగ్ సోమవారం నాడు హెచ్చరించారు.

1890 నాటి చైనా బ్రిటిష్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత ఆర్మీ మోసం చేస్తోందని, నిబంధనలకు విరుద్దంగా తమ భూబాగంలోకి సైన్యం చొచ్చుకొచ్చిందని ఆయన ఆరోపించారు. వెంటనే భారత బలగాలను వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో భౌగోళిక సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు చైనా అన్ని అత్యవసర చర్యలు చేపడుతోందని యుద్దానికైనా సిద్దమనే సంకేతాలను ఇచ్చింది.

Amid border stand-off, Chinese ships on prowl in Indian Ocean

సిక్కిం ప్రాంతంలో భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దులు ముందుగా నిర్ణయించినట్టుగానే ఉన్నాయన్నారు. మా భూభాగంలోకి ప్రవేశించడం, మా సైనికులు కార్యక్రమాలను అడ్డు తగలడం ద్వారా అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోంది. సరిహద్దులో శాంతికి ఆటంకం కలిగిస్తోంది. వెంటనే భారత్ ఆర్మీ వెనక్కు వెళ్ళాలని గెంగ్ ప్రకటించారు.

సిక్కింపై 1890 నాటి చైనా బ్రిటిష్ ఒప్పందాన్ని తొలి భారత ప్రధాని నెహ్రు 1959 లో నాటి చైనా ప్రధాని చౌ ఎన్ లైకి రాసిని లేఖలో ఆమోదించారు. తర్వాతి భారత ప్రధానులందరూ దీన్ని గౌరవిస్తున్నారు. కానీ, ఈ మధ్య సిక్కిం సరిహద్దులో భారత్ తీసుకొన్న చర్య మోసపూరితం.డోకా లా చైనాకు సంబంధించిన ప్రాంతం. అందుకే భారత్ వెనక్కు వెళ్ళిపోవాలన్నారు గెంగ్. భూటాన్ ను భారత్ రక్షణ కవచంలా వినియోగించుకోంటోందన్నారు.

జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ ఈ నెల 26న, బ్రిక్స్ దేశాల సమావేశానికి హజరుకానున్నారు. ఈ సమయంలోనే చైనా ఎన్ఏస్ ఏ యాంగ్ జీచీతో సిక్కింపై చర్చించే అవకాశం ఉంది. చైనా సరిహద్దుల్లో ఉన్న సిక్కిం 1976 లో భారత్ లో అంతర్భాగమైంది. 1898 లో చైనాతో చేసుకొన్న ఒప్పందాల ప్రకారం సిక్కిం సరిహద్దులను నిర్ణయించారు.

English summary
The India-China military stand-off seems set for a long haul with China responding to defence minister Arun Jaitley's remark that India is not what it was in 1962 by saying neither was China and the developments coinciding with unusual activity of Chinese warships in the Indian Ocean.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X