శత్రువు పొంచినవేళ భారత రక్షణ వ్యవస్థలో భారీ లోపాలు: ఎయిర్ ఫోర్స్, నేవీపై కాగ్ సంచలన రిపోర్టులు
వాస్తవ నియంత్రణ రేఖ్(ఎల్ఏసీ) వెంబడి చైనా యుద్ధ తంత్రం.. వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాదం.. కింద శ్రీలంకతో చైనా రక్షణ ఒప్పందం.. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో డ్రాగన్ యుద్ధ నౌకలు, జలాంతర్గాముల సంచారం.. ఇది చాలదన్నట్లు బంగ్లాదేశ్ నుంచి అక్రమచొరబాట్లు.. మొత్తంగా మన దేశం దాదాపు అన్ని వైపుల నుంచి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న సందర్భమిది. గడిచిన కొద్ది నెలలుగా చైనా కవ్వింపులు తారాస్థాయి చేరినవేళ భారత రక్షణ వ్యవస్థలో భారీ లోపాలున్నట్లు వెల్లడికావడం అందరినీ కలవరపెడుతున్నది.
కొడాలి 100 తప్పలు కాస్తాం: జీవీఎల్ -జెరుసలేంకు భార్యతోనే వెళ్లారుగా: స్వామి -నాని కన్నీటిపర్యంతం

కాగ్ రిపోర్టులో సంచలనాలు..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసి నివేదికల్ని రూపొందించే ‘‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)'' రక్షణ రంగానికి సంబంధించిన పలు నివేదికలను బుధవారం పార్లమెంటుకు సమర్పించింది. ప్రభుత్వ నిర్ణయాలు, అవి చేపట్టే పనుల్లో లోపాలను కాగ్ ఎత్తిచూపడం సహజమే అయినప్పటికీ, సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రిపోర్టులోని అంశాలు కీలకంగా మారాయి. ప్రధానంగా ఎయిర్ ఫోర్స్, నేవీలో నవీకరణ, యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకల సామర్థ్యం, స్థాయి పెంపుపై కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన కొంత కాలంగా మన బలగాల బలం పెరగకపోగా.. క్రమంగా తగ్గుతూ వచ్చిందని కాగ్ రిపోర్టులో పేర్కొన్నారు.
జగన్ జీ.. మీ వల్ల చాలా సంతోషం - వార్డు సచివాలయాలు భేష్ - ఏపీ సీఎంకు ప్రధాని మోదీ కితాబు

ఎంఐ-17 మోడ్రనైజేషన్ కు ఇన్నేళ్లా?
‘‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రత్యేకమైనవిగా భావించే ఎంఐ-17 రకం తేలికపాటి హెలికాప్టర్లను మోడ్రనైజ్ చేయాలని 2002లో నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి 15 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం ఆ హెలికాప్టర్లు పరిమిత సామర్థ్యంతో మాత్రమే ఎగరగలవు. అంటే, ఇప్పటికిప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే కష్టమే. రక్షణ శాఖ పేలవమైన ప్రణాళిక, అనాలోచిత ధోరణే ఇందుకు కారణం. ఎంఐ-17 హెలికాప్టర్ల ఇంజన్ల అప్ డ్రేడేషన్ కోసం ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం అమలు చేయడానికి 15 ఏళ్లు పట్టింది. 2017లో ఆరంభమైన 56 ఎంఐ హెలికాప్టర్ల మోడ్రనైజేషన్ ప్రక్రియ 2024లో ముగుస్తుంది. ఆ గడువులోగా సదరు హెలికాప్టర్ల శకం కూడా ముగుస్తుంది'' అని కాగ్ నివేదికలో రాశారు.

నేవీ సామర్థ్యం తగ్గింది..
పార్లమెంటుకు కాగ్ అందజేసిన మరో రిపోర్టులో మన నౌకాదళం సామర్థ్యం.. బలోపేతం కావడానికి బదుల క్షీణిస్తోందని చెప్పడం గమనార్హం. యుద్ధనౌకల మోడ్రనైజేషన్ లేదా కొత్తవాటి కొనుగోలుకు ప్రక్రియలో విపరీతమైన జాప్యం, ఒప్పందాల కుదుర్చుకోవడంలో, వాటిని అమలు చేయడంలో తాత్సారం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కాగ్ తెలిపారు. ముగింపులో నిర్దేశించిన కాలక్రమాలకు కట్టుబడి ఉండకపోవడమే. యుద్ధనౌకలపై వార్ ప్లేన్లు, హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే (ల్యాండింగ్ ప్లాట్ఫాం డాక్స్ - ఎల్పీడీ) సామర్థ్యం దేశ అవసరాలకు తగినట్లుగా లేదన్నారు. యుద్ధనౌకల కొనుగోళ్లకు సంబంధించి 2010లో రూ.16వేల కోట్లతో ప్రతిపాదనలు చేశారు. కానీ తొమ్మిదేళ్ల తర్వాత కూడా అవి కార్యరూపం దాల్చలేదని, కొత్త ట్యాంకుల కోసం రూ.9,045కోట్లతో 2010లో చేసిన ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్లలేదని, నిర్ణీత కాలపరిమితిలో ఒప్పందాలను పూర్తి చేసుకోవడంలో నౌకాదళం విఫలం చెందిందని కాగ్ రిపోర్టులో రాశారు.

టెక్నాలజీ బదలాయింపు అనుమానమే
నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఆధునీకరణ, అవసరాలకు తగ్గట్లుగా సామర్థ్యం పెంచుకోవడంలో మనం వెనుకబడ్డామన్న కాగ్... రాఫెల్ జెట్ ఫైటర్లపై ప్రత్యేక నివేదికను రూపొందించడం గమనార్హం. రూ .300 కోట్లకు పైబడిన అన్ని కొనుగోళ్లలో, విదేశీ అమ్మకందారు కనీసం 30 శాతం పెట్టుబడిని ఇండియాలో పెట్టాల్సి ఉంటుంది. తద్వారా దేశీ తయారీ రంగం బలపడుతుందని ఆఫ్ సెట్ ఒప్పందాల నిబంధనలను నిర్దేశిస్తున్నాయి. కానీ రూ.59వేల కోట్లతో చేసుకున్న రాఫెల్ ఒప్పందానికి సంబంధించి దసాల్ట్ ఏవియేషన్ గానీ, రాఫెల్ యుద్ధవిమానంలో ఆయుధాలను సమకూర్చే ఎంబీడీఏ సంస్థగానీ కనీసం తమ టెక్నాలజీని భారత్ కు(డీఆర్డీవో)కు బదిలీ చేస్తాయన్న నమ్మకం లేదని కాగ్ పేర్కొనడం గమనార్హం. మొత్తంగా శత్రువు అదనుకోసం పొంచిఉన్న వేళ భారత రక్షణ రంగంలో లోపాలపై కాగ్ నివేదించడం సంచలనంగా మారింది.