వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం తేలుస్తారు?: చందా కొచ్చర్ భవితవ్యంపై సందిగ్ధం, సమావేశం కానున్న బోర్డు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐసీఐసీఐలో చందాకొచ్చర్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వీడియోకాన్ క్విడ్ ప్రో కో ఆరోపణలపై ఐసీఐసీఐ ఆమెకు అండగా నిలబడినా.. బోర్డు సభ్యుల నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీఈవో, ఎండీ పదవుల్లో ఆమె కొనసాగడంపై తాజాగా కొంతమంది సభ్యులు అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. మరికొంతమంది మాత్రం చందా కొచ్చర్ కు అండగా నిలబడినట్టు తెలుస్తోంది. మొత్తం 12మంది సభ్యులు ఉన్న ఐసీఐసీఐలో ఆమెకు అండగా నిలిచిందెవరు?.. వ్యతిరేకించిందెవరు? అన్నది మాత్రం వెల్లడి కాలేదు.

క్విడ్ ప్రో కో?: చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్‌లపై లుకౌట్ నోటీసులు క్విడ్ ప్రో కో?: చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్‌లపై లుకౌట్ నోటీసులు

రాజీనామా చేస్తారా?

రాజీనామా చేస్తారా?

ఈ నేపథ్యంలో చందా కొచ్చర్ భవితవ్యంపై ఒక నిర్ణయం తీసుకునేందుకు ఐసీఐసీఐ బోర్డు సభ్యులు ఈ వారంలోనే సమావేశం కాబోతున్నట్టు సమాచారం. సమావేశం అనంతరం చందా కొచ్చర్ రాజీనామా చేస్తారా?.. లేక కొనసాగుతారా? అన్న దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 నిర్ణయం ఆమెకే వదిలేసిన ఐసీఐసీఐ

నిర్ణయం ఆమెకే వదిలేసిన ఐసీఐసీఐ


ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా కొచర్‌ పదవి కాలం 2019 మార్చి 31 వరకు ఉంది. ఇప్పటికైతే రాజీనామాపై ఐసీఐసీఐ బోర్డు.. నిర్ణయాన్ని ఆమెకే వదిలేసింది.

ఇకముందు కూడా ఇలాగే వ్యవహరిస్తుందా?.. లేక కఠిన నిర్ణయాలు తీసుకుని ఆమెను సాగనంపుతుందా? అన్నది వేచి చూడాలి.
కాగా, బోర్డులో ఉన్న 12మంది సభ్యుల్లో.. ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు, ఒకరు ప్రభుత్వ నామినీ కాగా.. ఐదుగురు ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఉన్నారు.

క్విడ్ ప్రో కో:

క్విడ్ ప్రో కో:

వీడియోకాన్ గ్రూపుకు రూ.3250కోట్లు రుణం మంజూరు చేసిన చందా కొచ్చర్.. ఇందుకు గాను వ్యక్తిగత లబ్ది పొందారన్న ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. వీడియోకాన్ గ్రూపు యాజ‌మాన్యంతో చందాకొచ్చ‌ర్ భ‌ర్త‌కు వ్యాపార సంబంధాలు ఉన్న నేప‌థ్యంలో వీడియోకాన్ రుణ విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు ఉండొచ్చ‌ని, సీబీఐ ఈ వ్య‌వ‌హారంపై ప్రాథ‌మిక ద‌ర్యాప్తు జ‌రుపుతోంది.

ఆమెకు తెలియదు:

ఆమెకు తెలియదు:

వీడియోకాన్ గ్రూపుతో వ్యాపార సంబంధాలపై రెండు రోజుల క్రితం స్పందించిన దీపక్ కొచ్చర్.. ఈ వ్యవహారం చందా కొచ్చర్‌కు తెలియదని పేర్కొనడం గమనార్హం. వీడియోకాన్ గ్రూపుతో తన 50:50 డీల్, నుపవర్ రినెవెబుల్స్‌ సంస్థ ఏర్పాటు గురించి ఆమెకు తెలియదన్నారు.

ధూత్ రాజీనామా చేసిన 22ఏళ్ల తర్వాత ఆ విషయాన్ని ఆమెతో చెప్పినట్టు వెల్లడించారు. ధూత్ ఇతర బిజినెస్(ఆయిల్&గ్యాస్)తో బిజీ అవడం వల్లే నువపర్ నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.

English summary
A 10 member ICICI board is likely to re-assemble for a second assessment this week. The meeting would is to brainstorm whether to ask Chanda Kochhar, the CEO at ICICI bank to step down or to let her continue in her role.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X