వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై చైనా భారీ యుద్ధతంత్రం.. ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. క్షణక్షణం ఉత్కంఠ..

|
Google Oneindia TeluguNews

భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత మరింత ముదిరింది. ప్రధానంగా తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ ప్రాంతాల్లో ఇరు పక్షాలు ముఖాముఖి తలపడే పరిస్థితి. ఇప్పటికే సరిహద్దులో బలగాలను మోహరించిన చైనా.. యుద్ధ డ్రోన్లను సైతం ఎగరేస్తున్నది. బోర్డర్ కు సమీపంగా ఎయిర్ బేస్ ను మరింత విస్తరించి, యుద్ధ విమనాలు నిలిపింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో భారీ ఎత్తున తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. ఇటీవల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో డ్రాగన్ దూకుడు ప్రదర్శింస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది.

సరిహద్దులో టెన్షన్:యుద్ధ డ్రోన్లతో చైనా.. దీటుగా స్పందించిన భారత్.. అసలేం జరుగుతోందంటే.. సరిహద్దులో టెన్షన్:యుద్ధ డ్రోన్లతో చైనా.. దీటుగా స్పందించిన భారత్.. అసలేం జరుగుతోందంటే..

మోదీ హైలెవల్ మీటింగ్..

మోదీ హైలెవల్ మీటింగ్..


లదాక్ లో టెన్షన్ పెరిగిపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎమర్జెన్సీ తరహాలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్), త్రివిధ దళాల అధిపతులతోపాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రమే ఈ భేటీలో పాల్గొన్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాతోనూ ప్రధాని మోదీ విడిగా సమావేశమయ్యారు. అంతకుముందే..

రక్షణ మంత్రి బ్రీఫింగ్..

రక్షణ మంత్రి బ్రీఫింగ్..

ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్ నిర్వహించడానికి కొద్ది నిమిషాల ముందే.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ నేతృత్వంలో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతుల సమావేశం జరిగింది. లదాక్ లో గ్రౌండ్ రియాలిటీని ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే.. మంత్రికి వివరించారు. చైనాతో సమానంగా భారత్ కూడా బలగాలను మోహరింపజేయాలని, అదే సమయంలో మన భూభాగంవైపు నడుస్తోన్న రోడ్లు, ఇతర పనులను యధావిధిగా కొనసాగించాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ వెంటనే ప్రధానితో జరిగిన భేటీలో రక్షణ మంత్రి బ్రీఫింగ్ ఇచ్చారు. గత మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలకు మోదీ కీలక సవరణలు సూచించారని, చైనాతో అనుసరించాల్సిన విధానాన్ని కూడా ఖరారు చేశారని వెల్లడైంది.

మోదీ శాంతిమంత్రం..

మోదీ శాంతిమంత్రం..

టెర్రరిస్టుల పీచమణిచే క్రమంలో పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లిమరీ వైమానిక దాడులు జరిపిన మోదీ సర్కార్.. చైనా విషయంలో మాత్రం ఆచితూచి స్పందిస్తుండటం విశేషం. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా చైనా ప్రవర్తిస్తే కచ్చితంగా గట్టిగా నిలువరించాల్సిందేనన్న ప్రధాని మోదీ.. సాధ్యమైనంత మేరకు శాంతియుత పంథాలోనే సమస్యను పరిష్కరించుకుందామని త్రివిధ దళాలకు సూచించినట్లు తెలిసింది. చైనా డిమాండ్లకు తలవంచకుండానే.. లదాక్ లో టెన్షన్ తొలగిపోయే దిశగా అడుగులు వేయాలన్నట్లు సమాచారం.

ఆ రోడ్డుపైనే చైనా మంకుపట్టు..

ఆ రోడ్డుపైనే చైనా మంకుపట్టు..

భారత భూభాగంలో దేప్పాంగ్ - గల్వాన్ లోయకు మధ్య 255 కిలోమీటర్ల మేర నిర్మిస్తోన్న రహదారిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మొన్నటిదాకా ప్రకటనలకే పరిమితమైన డ్రాగన్ దేశం.. మే నెల ప్రారంభం నుంచి పూర్తిగా యుద్ధ పంథాను అనుసరిస్తున్నది. సమస్యను సామర్యసంగా పరిష్కరించుకునేందుకు భారత సైన్యం ఇప్పటికే ఆరు సార్లు చైనీస్ ఆర్మీతో భేటీకాగా, ప్రతిసారి రోడ్డు అంశంపైనే మంకుపట్టు పట్టడంతో చర్చలు విఫలమవుతూ వచ్చాయి. కాగా, రోడ్డుతోపాటు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాల విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరంలేదని ప్రధాని మోదీ సైతం భరోసా ఇచ్చారని తెలిసింది.

సంచలనం రేపిన శాటిలైట్ చిత్రాలు..

సంచలనం రేపిన శాటిలైట్ చిత్రాలు..

ప్రస్తుతం భారత్-చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న తూర్పు లదాక్ ప్రాంతానికి కేవలం 200 కిలోమీటర్ల దూరంలో చైనా భారీ ఎయిర్ బేస్ ను సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది. ఆ ప్రాంతాన్ని.. టిబెట్ భూభాగంలోని నారిగున్సా ఎయిర్ బేస్ గా నిపుణులు పేర్కొన్నారు. ఈ నెల 20 నాటికే ఆ ప్రాంతంలో అత్యాధునిక చైనీస్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను రెడీగా ఉంచినట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. అలాగే, పాంగాంగ్ సమీపంలోని గాల్వాన్ లోయలో.. గడిచిన రెండు వారాల్లో చైనా వందకుపైగా తాత్కాలిక గుడారాలను నిర్మించి, సైన్యాన్ని మోహరించింది.

అక్కడేం జరుగుతోంది..

అక్కడేం జరుగుతోంది..

చైనా సరిహద్దులో క్షణక్షణానికి టెన్షన్ పెరుగుతున్నట్లు వస్తోన్న వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. బోర్డర్ లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజెప్పాలని, ఎలాంటి విధానంతో చైనాను అడ్డుకుంటారో మోదీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాధినేతలు వరుసగా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తుండడంతో మొత్తానికి ఏదో జరుగుతోందన్న భావనలు ఢిల్లీ వర్గాల్లో కలుగుతున్నాయి. గతంలో కంటే భిన్నంగా చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నదని, ఇది రాబోయే ప్రమాదాలకు సంకేతమని నిపుణులు అంటున్నారు.

Recommended Video

PM Modi Meets NSA, CDS Over Tension @ India - China Border
డ్రాగన్ దూకుడు వెనుక భారీ కుట్ర..

డ్రాగన్ దూకుడు వెనుక భారీ కుట్ర..

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ చైనాను కార్నర్ చేశాయి. వూహాన్ ల్యాబ్ లో తనిఖీలు చేపట్టేందుకు ఐక్యరాజ్యసమితిలో అమెరికా చేసిన ప్రయత్నాలకు భారత్ మద్దతు పలికింది. అదీగాక, కరోనా అనంతర కాలంలో పదుల కొద్దీ కంపెనీలు తమ కార్యాలయాలను చైనా నుంచి భారత్ కు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ దశలో భారత్ ను అస్థిరపర్చడమే టార్గెట్ గా చైనా పావులు కదుపుతున్నది. ఎన్నడూ లేనిది నేపాల్ తో యుద్ధ భాష మాట్లాడించడం, భారత్ భూభాగాన్ని తమదిగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడం వెనుకా చైనా హస్తం ఉందనేది కాదనలేని సత్యం. లడాక్ లో పోరును క్రమంగా పెద్దది చేస్తూ.. సుదీర్ఘకాలంపాటు ఇండియాను ఇబ్బంది పెట్టాలని చైనా కంకణం కట్టుకున్నట్లు డిఫెన్స్ నిపుణులు అంటున్నారు.

English summary
Prime Minister Narendra Modi on Tuesday headed a high-level meeting to discuss the ongoing stand-off with China with NSA Ajit Doval, CDS General Bipin Rawat and the three Service Chiefs. Defence minister Rajnath singh also participated in meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X