• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కంగనా రనౌత్‌కు సీఎం ఘాటు హెచ్చరిక - మౌనాన్ని బలహీనతగా చూడొద్దు - కరోనాపై ఉద్ధవ్ ఠాక్రే కొత్త ప్లాన్

|

''మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. రాజకీయాలపై మాట్లాడాలంటే నేను ముఖ్యమంత్రి మాస్కును తీయాల్సి ఉంటుంది. అంతమాత్రాన నా దగ్గర సమాధానాలు లేవనుకోవద్దు. నా మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు..'' అంటూ కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితులు, కంగనా ఇష్యూ నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్

గవర్నర్ చెంతకు కంగన..

గవర్నర్ చెంతకు కంగన..

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఉదంతంలో ముంబై పోలీసుల్ని విమర్శించిన నటి కంగనా రనౌత్.. ముంబై సిటీని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చడం, బాంద్రాలోని ఆమె ఆఫీసును ముంబై మున్పిపల్ అధికారులు కూల్చేయడం, ఈ వివాదంలో బీజేపీ సహా ఎన్టీఏ పార్టీలన్నీ కంగను మద్దతుగా నిలవడం తెలిసిందే. ఉద్ధవ్ సర్కారుపై ఫిర్యాదు చేసేందుకు కంగన ఆదివారం సాయంత్రం గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కూడా కవలనున్నారు. ఈ లోపే ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం ఠాక్రే.. మహారాష్ట్రకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించడం గమనార్హం.

కంగనా, కరోనా ఇద్దరినీ వదలం..

కంగనా, కరోనా ఇద్దరినీ వదలం..

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షల మైలురాయి దాటి, ఆదివారం నాటికి 10.37లక్షలకు, మరణాల సంఖ్య 30వేలకు చేరింది. దేశంలోనే నమోదైన కరోనా మరణాల్లో 40 శాతం ఒక్క మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం పూర్తిగా ఉద్ధవ్ సర్కారు వైఫల్యమేనని, ప్రభుత్వం కరోనాతో పోరాడకుండా, కంగనాను భయపెట్టే పనిలో బిజీగా ఉందంటూ బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన విమర్శలకు సీఎం ఉద్ధవ్ సమాధానం చెప్పారు. కంగన పేరును ప్రస్తావించకుండా, రాజకీయ కుట్రలతోపాటు కరోనా మహమ్మారిపైనా తాము పోరాటం కొనసాగిస్తామని సీఎం అన్నారు.

చైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదు

కొవిడ్ అయిపోయిందన్నారుగా..

కొవిడ్ అయిపోయిందన్నారుగా..

వెస్ట్ బెంగాల్ లో కరోనా లేదు.. ఇక ఎన్నికల ప్రచారానికి ఇబ్బందులు రావంటూ ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేయడం, బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఎన్డీఏ సర్కార్ కరోనాను తక్కువ చేసి చూపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై సెటైర్లు వేశారు. ‘‘కొంతమంది కరోనా అయిపోయిందని భావించి, రాజకీయాలను మొదలుపెట్టారు. వాటిపై సరైన సమయంలో స్పందిస్తా. అవసరమైతే ‘సీఎం ప్రోటోకాల్' ను పక్కనెట్టి మరీ మాట్లాడుతా''అని పేర్కొన్నారు.

  Kangana Ranaut : ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు! - కంగనా రనౌత్ || Oneindia Telugu
  నా కుటుంబం - నా బాధ్యత

  నా కుటుంబం - నా బాధ్యత

  మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంపై ప్రతిపక్ష బీజేపీ సీఎంపై విమర్శల్ని తీవ్రతరం చేసింది. అయితే, వాస్తవానికి రాష్ట్రంలో రికవరీ రేటు గణనీయంగా ఉందని, టెస్టుల విషయంలో రాజీ పడకపోవడం వల్లే కేసుల సంఖ్య భారీగా ఉందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. కరోనా కాలంలో చేపట్టిన ‘మిషన్ బిగిన్ అగైన్'లో భాగంగా ఈనెల 15 నుంచి ‘నా కుటుంబం - నా బాధ్యత' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు సీఎం తెలిపారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రమంతటా వైద్యాధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటారని, కరోనా పట్ల ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని ఉద్ధవ్ చెప్పారు.

  English summary
  Facing flak from detractors on both political and coronavirus front, Maharashtra chief minister Uddhav Thackeray on Sunday said a conspiracy is afoot to malign Maharashtra. "Whatever political storms come, I will face... I will fight coronavirus too," Thackeray said in a televised public address. "I will have to remove the mask of chief minister to respond to politics. I don't speak doesn't mean I don't have answers," Thackeray said
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X