వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: అక్కడ మసీదును ధ్వంసం చేసి కాషాయం జెండా పాతారు, ఏంజరుగుతోంది..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై ప్రపంచ దేశాల్లో కూడా చర్చజరుగుతోంది. ఇందుకు కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ అల్లర్లకు సంబంధించి చిన్న పోస్టుకూడా వైరల్‌గా మారుతోంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈ అల్లర్లు తారాస్థాయికి చేరడం, పరస్పర దాడుల్లో పలువురు చనిపోవడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మీడియా సమావేశంలో కూడా జర్నలిస్టుల నుంచి ఢిల్లీ అల్లర్లపై ప్రశ్నలు ఎదుర్కోవడం జరిగింది. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

ఢిల్లీలో ఫిబ్రవరి 25వ తేదీన ట్విటర్‌లో ఓ వీడియో ట్రెండ్ అయ్యింది. అశోక్‌నగర్‌లోని ఓ మసీదు పైకి ఎక్కిన కొందరు హిందూవాదులు మసీదుపై ఉన్న మినార్‌ను ధ్వసం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు అక్కడ కాషాయ జెండాను పాతారు. అదే సమయంలో జైశ్రీరాం అంటూ గట్టిగా నినదించారు. హిందువులదే హిందుస్తాన్ అంటూ గట్టిగా కేకలు వేశారు. ఈ వీడియోను ఆయుబ్ అనే ఓ జర్నలిస్టు ట్విటర్‌లో పోస్టు చేయగా ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది. సీఏఏకు వ్యతిరేకంగా జరిగుతున్న నిరసనలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని తెలియడంతో ఈ వీడియోను తొలగించాడు జర్నలిస్టు. కానీ ఆ తర్వాత ఇది సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నందునే కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని నిర్థారించుకున్న తర్వాత తిరిగి వీడియోను పోస్టు చేశాడు.

Amid the Delhi riots, Video of a mosque being vandalised makes rounds on social media

ఇదిలా ఉంటే ఎలాంటి మసీదు అశోక్‌విహార్‌లో ధ్వంసం కాలేదని పూనావాలా అనే మరో వ్యక్తి నార్త్ వెస్ట్ ఢిల్లీ డీసీపీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సమాధానంగా ట్వీట్ చేశాడు. అంతేకాదు మరో న్యూస్ ఏజెన్సీకి సంబంధించిన ట్వీట్‌ను కూడా పూనావాలా ట్వీట్ చేశారు. జర్నలిస్ట్ ఆయుబ్ తప్పుడు సమాచారంను ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక దీంతో చాలామంది ఆయుబ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆయుబ్ రెండేళ్ల క్రితం బీహార్‌లో జరిగిన వీడియోను ఇప్పుడు పోస్టు చేశాడంటూ మరో వ్యక్తి చెప్పుకొచ్చారు. అంతేకాదు తప్పుడు వీడియోను పోస్టు చేసిన ఆయుబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.

English summary
Among the top Twitter trends on February 25 were ‘mosque’ and ‘Rana Ayyub’. The words gained traction after the journalist shared a video of a mob chanting “Jai Shri Ram” and “Hinduon ka Hindustan” planted a saffron flag atop a mosque in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X