చంపేస్తామని బెదిరింపుల మధ్య .. మళ్లీ కోర్టుకు సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నేడు కృష్ణ జింక వేట కేసులో ఆయన వేసిన పిటీషన్ పై విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయనకు చంపేస్తామని బెదిరింపులు వచ్చిన నేపధ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. నేడు ఆయనను సురక్షితంగా కోర్టుకు హాజరుపరిచేలా అన్ని చర్యలు తీసుకున్నారు. గతంలో ఈ కేసులో కోర్టు శిక్ష వేసిన నాటి నుండి నేటి వరకు ఆయన మళ్ళీ కోర్టుకు హాజరు కాకపోవటంతో నేడు కోర్టుకు హాజరు అనివార్యం అయ్యింది. ఒకవేళ హాజరు కాకుంటే ఆయన బెయిల్ రద్దు చేస్తామని కోర్టు ప్రకటించింది.
ఏపీ రాజధానిలో దొంగలు పడ్డారు.. ఏం దోచుకెళ్ళారో తెలిస్తే షాక్ అవుతారు!!

జోధ్‌పూర్ సెషన్స్ కోర్టులో కేసు కొట్టివెయ్యాలని సల్మాన్ ఖాన్ పిటీషన్
కృష్ణ జింకను వేటాడిన కేసు సల్మాన్ ఖాన్ ను ఇంకా వీడడం లేదు. 1990ల్లో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో సల్మాన్ జోధ్‌పూర్ అడవుల్లో కృష్ణజింకను వేటాడారు. ఆ సమయంలో సల్మాన్‌తో పాటు బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రేలు ఉన్నప్పటికీ వారి ప్రమేయం ఏమి లేకపోవడంతో ఈ కేసులో సల్మాన్ ఒక్కరే దోషిగా తేలారు. జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌కు ఐదేళ్లు కారాగార శిక్ష విధించింది. ఒకరోజు జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న సల్మాన్ ఖాన్ ఆ మరుసటి రోజే బెయిల్‌పై బయటికి వచ్చారు. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన కావడంతో తనపై వేసి కేసును మరోసారి పునఃపరిశీలించి, కొట్టివేయాలని సల్మాన్ జులైలో జోధ్‌పూర్‌కు చెందిన సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్ కు సంబంధించిన వాదనలు నేడు కొనసాగనున్నాయి.

బెదిరింపుల నేపధ్యంలో కోర్టుకు హాజరుకానున్న సల్మాన్
అయితే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో నేడు సల్మాన్ ఖాన్ కోర్టుకు హాజరు కావడానికి పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకను వేటాడిన వ్యవహారంలో బెదిరింపులు వస్తున్నాయి. గతంలో లారెన్స్ బిష్ణోయ్ అనే ఒక గ్యాంగ్ స్టర్ పోలీసుల సమక్షంలోనే తనని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సల్మాన్ ఇంటివద్ద భద్రతను పెంచారు. ఇక తాజాగా పంజాబ్ యూనివర్శిటీకి చెందిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తమ ఫేస్బుక్ పోస్ట్‌లో సల్మాన్‌కు ఉరిశిక్ష తప్పకుండా పడుతుందని ఓ పోస్ట్ పెట్టారు.

సల్మాన్ కు స్టూడెంట్ ఆర్గనైజేషన్ వార్నింగ్ .. సోషల్ మీడియాలో పోస్ట్
సల్మాన్ ను ఉద్దేశించి నువ్వు భారతీయ చట్టం నుంచి తప్పించుకోగలవు అనుకుంటున్నావేమో. కానీ బిష్ణోయ్ సమాజ్, పంజాబ్ యూనివర్శిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నీకెప్పుడో ఉరిశిక్షను ఖరారు చేసింది అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు నువ్వు మా కోర్టులో దోషివని పేర్కొన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ అమ్మాయిలను గౌరవించమని, జంతువులను సంరక్షించమని డ్రగ్స్‌కి దూరంగా ఉండమని, పేదలకు సాయం చెయమని ఆ పోస్ట్‌లో తెలిపారు.

కోర్టులో నేడు విచారణ .. సర్వత్రా ఉత్కంఠ
అయితే కృష్ణజింకను చంపిన కేసులో నేడు సల్మాన్ జోధ్‌పూర్ న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో కోర్టుకు హాజరు కాలేదు. కానీ కోర్టు నేడు కచ్చితంగా సల్మాన్ ఖాన్ హాజరుకావాలని, ఒకవేళ హాజరుకాని పక్షంలో ఆయనకిచ్చిన బెయిల్ ను రద్దు చేస్తామని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కోర్టుకు హాజరు కావటం కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఇంటివద్ద భద్రత పెంచిన పోలీసులు, నేడు కోర్టుకు హాజరు కావడానికి కూడా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి నేడు సల్మాన్ ఖాన్ కోర్టుకు హాజరు కావడం తప్పని సరి కావడంతో, కోర్టులో విచారణలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!