వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచల్ ప్రదేశ్‌లో ఉద్రిక్తత, రెచ్చిన నిరసనకారులు: పీఆర్సీపై తగ్గిన ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో శాశ్వత నివాస పత్రాన్ని (పర్మినెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ -పీఆర్సీ)పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రెండు గిరిజన తెగలలకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పీఆర్సీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఆరు తెగలకు పీఆర్సీ ఇచ్చే విషయమై హైలెవల్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం (అరుణాచల్ ప్రదేశ్) అంగీకరించలేదని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన ఆయన విమర్శలు గుప్పించారు.

Amid violent protests, Arunachal Pradesh scraps Permanent Residency move

రాష్ట్రంలోని నామ్‌సాయి, చాంగ్‌లాండ్ జిల్లాల్లో ఆరు కమ్యూనిటీలకు పీఆర్సీ ఇవ్వాలన్నా హై పవర్డ్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని, ఈ మేరకు ప్రకటన కూడా జారీ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రేమాఖందు అఖిల పక్ష సమావేశానికి పిలిచారు.

కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. పోలీసు కాల్పుల్లో శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి మరణించిన ఘటన అనంతరం అరుణాచల్‌లో ఉద్రిక్తత నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం అరుణాచల్‌ ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్‌ బంగళాను ఆందోళనకారులు కూడా దగ్ధం చేశారు. జిల్లా కమిషనర్‌ నివాసాలకు సైతం ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎస్పీ స్ధాయి పోలీస్‌ అధికారికి గాయాలయ్యాయి. ఘర్షణలు తీవ్రం కావడంతో సైన్యాన్ని రంగంలోకి దించారు. వారు ఇటానగర్‌లో కవాతు నిర్వహించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి కర్ఫ్యూ విధించారు.

English summary
Amid violent protests, the BJP-led Arunachal Pradesh government on Sunday scrapped the decision of granting permanent resident certificates (PRC) status to two tribes from outside the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X