వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పలు రికార్డులు

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గత ఇరవై అయిదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ ఆధిక్యంతో వెంకయ్య నాయుడు గెలుపొందారు. 1992లో కేఆర్‌ నారాయణన్‌కు అత్యధికంగా 699 ఓట్ల మెజారిటీ వచ్చింది. అప్పుడు మరో అభ్యర్థి జోగిందర్‌ సింగ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గత ఇరవై అయిదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ ఆధిక్యంతో వెంకయ్య నాయుడు గెలుపొందారు.

1992లో కేఆర్‌ నారాయణన్‌కు అత్యధికంగా 699 ఓట్ల మెజారిటీ వచ్చింది. అప్పుడు మరో అభ్యర్థి జోగిందర్‌ సింగ్‌కు కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. 1992 తర్వాత ఇప్పటి వరకు అయిదుసార్లు ఎన్నికలు జరిగాయి.

వెంకయ్యకు ఓటు వేసిన అనంతరం, రాజీనామా చేసిన యోగివెంకయ్యకు ఓటు వేసిన అనంతరం, రాజీనామా చేసిన యోగి

వీటిలో వెంకయ్యనాయుడికి వచ్చిన 272 ఓట్ల మెజారిటీయే అత్యధిక ఆధిక్యం. 1992 తర్వాత పోలైన ఓట్ల సంఖ్య పరంగా చూసినా అత్యధికంగా ఆయనకే 516 ఓట్లు లభించాయి. 1992లో కేఆర్‌ నారాయణన్‌కు 700 ఓట్లు వచ్చాయి.

790 పార్లమెంటు స్థానాల్లో

790 పార్లమెంటు స్థానాల్లో

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ముందెన్నడూ లేనంత భారీగా ఈసారి ఓట్లు పోలయ్యాయి. గతంలో అత్యధికంగా 2002లో 759 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి 771 మంది వినియోగించుకున్నారు.

మొత్తం 790 పార్లమెంటు స్థానాల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూత, మాయావతి రాజీనామా కారణంగా రాజ్యసభలో రెండు ఖాళీలు ఉన్నాయి. అనంతనాగ్‌ స్థానానికి ఉప ఎన్నిక రద్దవడం, వినోద్‌ ఖన్నా మృతి వల్ల లోకసభలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 786 మంది ఎంపీల్లో 771 మంది ఓటు వేశారు.

ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు కనిపించాయి. వెంకయ్య తన ఓటును తనకే వేసుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతూ అదే సభకు ఛైర్మన్‌ (ఉపరాష్ట్రపతి)గా ఎన్నికయిన తొలి వ్యక్తి కూడా వెంకయ్యే కావడం గమనార్హం.

ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కోసమే ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ఇకపై ఆయన రాజీనామా చేయనున్నారు.

రాజీనామా

రాజీనామా

ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ఉపముఖ్యమంత్రి ఓటు వేయడం విశేషం. లోకసభ సభ్యులుగా ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటేసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసమే వారిని ఎంపీలుగా కొనసాగిస్తూ బిజెపి నాయకత్వం నిర్ణయించింది. అప్పటి వరకు రాజీనామా చేయకూడదని సూచించింది.

ఓటింగ్‌

ఓటింగ్‌

15 మంది ఓటు వేయలేదు. నలుగురు టిఎంసి, ముగ్గురు బిజెపి, ఇద్దరు కాంగ్రెస్‌, ఇద్దరు ముస్లిం లీగ్‌ సభ్యులు, ఎన్సీపీ, పీఎంకేల నుంచి ఒకరు చొప్పున ఎంపీలు, రాజ్యసభ నామినేటెడ్‌ సభ్యుడు ఒకరు, లోకసభ స్వతంత్ర సభ్యుడు ఒకరు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

English summary
Venkaiah Naidu incidentally broke a 25 year old record by securing such a high number of votes. While the BJP was expecting 502 votes for Naidu, it appears that he secured a higher number after 20 lawmakers cross voted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X