వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ప్రక్షాళనపై రాహుల్ దృష్టి.. గుజరాత్ చీఫ్‌గా అమిత్ ఛావ్డా, త్వరలో మరిన్ని మార్పులు!?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తమ పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తమ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన రాహుల్ గాంధీ... చెప్పినట్లుగానే అమిత్‌ చవ్డా(35)కు గుజరాత్‌ పీసీసీ బాధ్యతలను అప్పజెపుతూ నిర్ణయం తీసుకున్నారు.

అంక్లవ్ నియోజవర్గం ఎమ్మెల్యే అయిన ఛావ్డా ప్రస్తుతం పార్టీ చీఫ్ విప్‌గా ఉన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తరువాత ఆ పార్టీ సీనియర్‌ నేత భరత్‌ సింహ్ సోలంకి గుజరాత్ పీసీసీ పదవికి రాజీనామా చేయాలని భావించినప్పటికీ రాహుల్ గాంధీ వారించడంతో ఆయన తన రాజీనామాను వాయిదా వేసుకున్నారు.

rahul-gandhi

తాజాగా మంగళవారం ఈ పదవిని రాహుల్ గాంధీ అమిత్ చవ్డాకు కట్టబెట్టారు.
ఇక పార్టీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌గా ఉన్న కొప్పుల రాజును కూడా తొలగించిన రాహుల్ గాంధీ ఆ స్థానంలో నితిన్‌ రౌత్‌ను నియమించారు. రాబోయే రోజుల్లో పార్టీలో పెనుమార్పులు తప్పవని, మిగిలిన రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల మార్పు కూడా జరగనుందని ఏఐసీసీ పేర్కొంది.

English summary
Amit Chavda will be the new Gujarat Congress State President replacing Bharatsinh Solanki on Tuesday. Congress leader Amit Chavda has won from an Anklav constituency in Gujarat elections with Congress 90603 votes.Chavda is the first cousin of Bharatsinh Solanki. His grandfather was also a parliamentarian.Chavda is chief whip of the party in the Gujarat Assembly.Chavda is relative of Bharatsinh Solanki. He had in his public meetings during last assembly election campaign openly declared Bharatsinh Solanki as future Chief Minister from Central Gujarat. Chavda considers Madhavsinh Solanki and his son Bharatsinh as his mentors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X