వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్నబ్ అరెస్టును ఖండించిన అమిత్ షా,నడ్డా... అసలేంటీ కేసు... ఎందుకు రీఓపెన్ చేశారు?

|
Google Oneindia TeluguNews

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్టు విషయంలో పోలీసుల వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పరిగణించే జర్నలిజంపై దాడి సరికాదన్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అర్నబ్ గోస్వామి అరెస్టును ఖండించారు. 'దేశంలో ఎమర్జెన్సీ విధించినా ఇందిరా గాంధీని భారత్ మర్చిపోలేదు. అలాగే పత్రికా స్వేచ్చపై దాడి చేసిన రాజీవ్ గాంధీని మరిచిపోలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జర్నలిస్టులపై దాడులు చేస్తున్నందుకు సోనియా-రాహుల్‌లను భారత్ మరోసారి శిక్షించి తీరుతుంది.' అని నడ్డా ఘాటు వ్యాఖ్యలు చేశారు.పత్రికా స్వేచ్చను,భావ ప్రకటనా స్వేచ్చను విశ్వసించే,గౌరవించే ప్రతీ వ్యక్తి ఇప్పుడు మహా సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నాడని నడ్డా పేర్కొన్నారు. తమ రాజకీయాలతో విబేధించినందుకే అర్నబ్‌ను టార్గెట్ చేశారని... సోనియా,రాహుల్ డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

అర్నబ్ గోస్వామి అరెస్ట్.. ముంబైలో హైడ్రామా.. జుట్టుపట్టుకుని కొట్టారని ఆరోపణలు...అర్నబ్ గోస్వామి అరెస్ట్.. ముంబైలో హైడ్రామా.. జుట్టుపట్టుకుని కొట్టారని ఆరోపణలు...

ఏ కేసులో అరెస్టు...

ఏ కేసులో అరెస్టు...

ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ముంబై రాయ్‌గఢ్ పోలీసులు బుధవారం(నవంబర్ 4) ఉదయం అర్నబ్ గోస్వామిని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అర్నబ్ అరెస్టుకు సహకరించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు తనతో పాటు తన కుటుంబంపై దాడికి పాల్పడ్డారని అర్నబ్ ఆరోపించారు. తన జుట్టు పట్టుకుని భౌతిక దాడి చేశారని ఆరోపించారు.

2018 నాటి ఆత్మహత్య కేసు..

2018 నాటి ఆత్మహత్య కేసు..


అర్నబ్‌ను అరెస్ట్ చేసిన కేసు వివరాలను పరిశీలిస్తే... ఆ సంఘటన 2018లో జరిగింది. మహారాష్ట్ర రాయ్‌గఢ్ పరిధిలోని అలీబౌగ్‌లోని ఓ బంగ్లాలో మే,2018లో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభించాయి. ఆ ఇద్దరినీ అన్వయ్ నాయక్, అతని తల్లి కుముద్ నాయక్‌లుగా గుర్తించారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో అన్వయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. అంతకన్నా ముందు తన తల్లి కుముద్ నాయక్ గొంతు నులిమి హత్య చేసి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు.

అర్నబ్‌పై ఆరోపణలు..

అర్నబ్‌పై ఆరోపణలు..

ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఆ బంగ్లాలో ఓ సూసైడ్ నోట్ దొరికింది. ఇంగ్లీషులో రాసిన ఆ లేఖలో అన్వయ్ నాయక్ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి గురించి ప్రస్తావించాడు. రిపబ్లిక్ టీవీ జర్నలిస్టు అర్నబ్ గోస్వామితో సహా మరో మూడు కంపెనీలు తనకు రావాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో ఆర్థికంగా తాను చితికిపోయానని... అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని వెల్లడించాడు. అయితే అన్వయ్ నాయక్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లుగా ఆధారాలేవీ లభించకపోవడంతో ఏప్రిల్,2019లో ఈ కేసును మూసివేశారు.

కేసు రీఓపెన్

కేసు రీఓపెన్

ఈ ఏడాది మే నెలలో అన్వయ్ కుమార్తె మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఆశ్రయించి కేసును రీఓపెన్ చేయాలని కోరారు. అర్నబ్ గోస్వామి తన తండ్రికి చెల్లించాల్సిన రూ.83లక్షల విషయాన్ని పోలీసులు పట్టించుకోలేదని హోంమంత్రికి తెలిపారు. దీంతో హోంమంత్రి సీఐడీ విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ కేసును రీఓపెన్ చేసేందుకు కోర్టు అనుమతినిచ్చిందని చెప్తూ... బుధవారం ఉదయం రాయ్‌గఢ్ పోలీసులు అర్నబ్ నివాసానికి వెళ్లారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని రాయ్‌గఢ్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీసులు అర్నబ్‌ను విచారిస్తున్నారు.

English summary
Union Home Minister Amit Shah on Wednesday condemned Mumbai Police's attack and assault on Republic Media Network's Editor-in-Chief Arnab Goswami and slammed the Congress-led MVA government for the 'blatant misuse of state power' to target the 4th pillar of democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X