వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐకమత్యంగా కరోనాను తరిమికొడదాం.!విపక్షపార్టీలకు అమిత్ షా పిలుపు.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర హోంమంత్రి అమీత్ షా సాహసోపేతమైన పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న వివత్కర పరిస్తితుల పట్ల సానుకూల దృక్పదంతో ఉండడమే కాకుండా విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంగా కరోనా వైరస్ ను తరిమికొడదామని అమిత్ షా స్పష్టం చేసారు. చిన్న పార్టీ పెద్ద పార్టీ అనే బేదం లకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు కృషి చేయాలని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో ప్రతివారికీ కరోనా టెస్టులు జరుగుతాయని, రానున్న రోజుల్లో రోజుకు పద్దెనిమిది వేల పరీక్షలు నిర్వహించేలా చూస్తామని అమిత్ షా చెప్పారు.

 Amit Shah calls for opposition parties to fight unitely against corona.!

కాగా సోమవారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను అన్ని రాజకీయ పార్టీలు పాటించడమే కాకుండా తప్పని సరి అమలయ్యేలా చూడాలని కోరారు. అమీత్ షా నేతృత్వంలో జరిగిన ఈ అత్యున్నత స్తాయి సమావేశంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గానీ, డిప్యూటీ సీఎం మనీష్ సిశోడియా గానీ, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ గానీ పాల్గొనలేదు. ఈ సమావేశానంతరం అమిత్ షా లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కరోనా వైరస్ రోగులకు ఇస్తున్న చికిత్స, ఆసుపత్రిలో సౌకర్యాలను సమీక్షించారు. ఢిల్లీలో మళ్ళీ లాక్‌డౌన్ విధించే అంశంపై త్వరలో మళ్లీ సమావేశం కావాల్పి ఉందని అమీత్ షా స్పష్టం చేశారు.

English summary
Amit Shah made it clear that he was not only positive about the country's catastrophic situation, but also united in the fight against the corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X