వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి చీఫ్ అమిత్‌ షా ఆఫర్: ఒంటరి పోరేనని శివసేన

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: 2019 ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తోందని ఆ పార్టీ ప్రకటించింది.. 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఆఫర్‌ను శివసనే తిరస్కరించింది.

ముంబైలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని శివసేనకు బిజెపి ఆఫరిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు ముంబైలో నిర్వహించిన సభలో శివసేనను కలిసి పోటీ చేద్దామని ఆహ్వనించాడు.

Amit Shah, Devendra Fadnavis woo Shiv Sena as Uddhav Thackeray threatens to split

2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని అమిత్ షా పంపిన స్నేహపూర్వక ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకోరాదని గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు శనివారం నాడు శివసేన స్పష్టత ఇచ్చింది.

బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో అమిత్ షా మాట్లాడుతూ శివసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే ఉండాలని నిజాయతీగా కోరుకుంటున్నట్లు చెప్పారు. శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్ శనివారం నాడు స్పందించారు.

వాళ్ళ భాష మారిందన్నారు. ఆరు నెలల క్రితం వాళ్ళు బీజేపీ ప్రభుత్వమనే అనేవారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎన్డీయే ప్రభుత్వమని అనడం ప్రారంభించారన్నారు. దీన్నిబట్టి వాళ్ళ ఆత్మవిశ్వాసం క్షీణించినట్లు అర్థమవుతోందన్నారు. శివసేన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే గతంలో చేసిన ప్రకటనను సుభాశ్ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ఉద్ధవ్ చెప్పారని తెలిపారు. ఆ నిర్ణయం నుంచి ఆయన వెనుదిరగలేదన్నారు. అందువల్ల శివసేన సొంతంగానే పోటీ చేసి, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

English summary
Shiv Sena chief Uddhav Thackeray had already announced that his party will fight the 2019 Lok Sabha elections alone. With Shah seeking to woo the Shiv Sena,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X