వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా భావోద్వేగం..! ఇర్ఫాన్ వంటి వ్యక్తిని కోల్పోవడం శోచనీయమన్న హోంమంత్రి..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లో కూడ తన సత్తా చాటుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం తీరని లోటని కేంద్ర హోం మంత్రి అమీత్ షా ఆవేదన వ్యక్తం చేసారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఇర్పాన్ తల్లి సయిదా 95 ఏళ్ల వయసులో అనారోగ్యంతో జైపూర్ లో మృతి చెందారని, ఆ తర్వాత నాలుగురోజుల వ్యవధిలోనే ఇర్ఫాన్ ఖాన్ మరణించారని అమీత్ షా భావోద్వేగానికి లోనయ్యారు.

కాగా లాక్ డౌన్ కారణంగా జైపూర్ లోని తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరుకాలేకపోయారు. తల్లి మరణం పట్ల తీవ్రంగా రోధించారు ఇర్ఫాన్ ఖాన్. అయితే మూడు రోజసులకే తాను అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరారు ఇర్ఫాన్. అతనికి ఇప్పటికే క్యాన్సర్ ఉంది. లండన్ లో చికిత్స తీసుకుని చాలావరకు కోలుకున్నారు. బుధవారం పరిస్థితి విషమించి ఇర్ఫాన్ ఖాన్ తుదిశ్వాస విడిచారు.

Amit Shah Emotion.! The loss of a man like Irfan khan is sad said Home Minister..!!

ఇర్ఫాన్ మరణం పై ప్రముఖ బాలీవుడ్ నటీనటులందరితో పాటు రాజకీయ ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. తాజగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇర్ఫాన్ కు నివాళులు అర్పిస్తూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేశం ఒక అద్భుతమైన వ్యక్తిని మాత్రమే కాదు, ఒక మంచి మనిషిని కోల్పోయిందని బాదాతప్త హృదయంతో తెలిపారు. సహృదయుడయిన ఇర్ఫాన్ అంతర్జాతీయంగా మెప్పుపొంది మనదేశానికి ఎంతో పేరు తెచ్చారని అమిత్ షా కొనియాడారు.

ఇర్ఫాన్ లాక్ డౌన్ ఆంక్షల కారణంగా మూడు సార్లు సమస్యల్లో చిక్కుకున్నారని, మార్చి 13న అంగ్రేజీ మీడియం అనే సినిమా విడుదల కాగా లాక్ డౌన్ తో సినిమా ప్రదర్శన ఆగిపోయిందని, కేవలం వారం రోజులే థియేటర్లే ఆ సినిమా ప్రదర్శించబడిందని, ఆ తర్వాత ఇదే లాక్ డౌన్ లో తల్లిని కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురైన ఇర్ఫాన్ ఖాన్ చివరకు ఆయనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారని అమీత్ షా తెలిపారు.

English summary
Union Home Minister Amit Shah paid tribute to Irrfan Khan and recalled his memories. He said with a heart of heart that the country had lost a wonderful man. Amit Shah praised his colleague Irrfan for being internationally acclaimed and making a great name for our country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X