వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా చెప్పిందే నిజమైంది, కానీ: అఖిలేష్ తొందరపడ్డారు!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని ముందు ఊహించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందే ఊహించినట్లున్నారు. అందుకే యూపీ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఓ మాట అన్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని ముందు ఊహించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందే ఊహించినట్లున్నారు. అందుకే యూపీ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఓ మాట అన్నారు. అది ఇప్పుడు నిజమైంది.

అసలు అమిత్ షా ఏమన్నారంటే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కు ఓటమి తప్పదని, మార్చి 11న ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడతాయని, మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాజీనామా సమర్పించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు.

ఐదు రాష్ట్రాల ఫలితాలు: రాహుల్ భారమేనా?, కాంగ్రెస్‌లో తిరుగుబాటు!ఐదు రాష్ట్రాల ఫలితాలు: రాహుల్ భారమేనా?, కాంగ్రెస్‌లో తిరుగుబాటు!

అప్పుడన్న అమిత్‌షా మాటలు శనివారం వెలువడిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వాస్తవం చేశాయి. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ఎస్పీ నేత, యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే అమిత్‌షా జోస్యం చెప్పినట్టు మధ్యాహ్నం ఒంటిగంటకు కాకుండా అంతకంటే ముందుగా 11 గంటలకే అఖిలేశ్‌ రాజీనామా చేయడం గమనార్హం.

amith shah expected this up assembly results

శనివారం 10.30గంటలకే ఫలితాలు వెలువడటంతో అఖిలేశ్‌ రాజీనామా చేశారు. అయితే, ఆ సమయానికే బీజేపీ 200కిపైగా సీట్లలో ఆధిక్యం చాటుకుంది. రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రచారంలో కీలకపాత్ర పోషించిన అమిత్‌షా ప్రచారంలో అఖిలేశ్‌ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రచారంతో పాటు అభ్యర్థుల ఎంపికలోను ప్రధాన పాత్ర పోషించారు.

రాష్ట్రంలో ఓబీసీ వర్గాలైన రాజ్‌బర్‌, కుర్మీ, కొయిరీ... తదితరులను పార్టీవైపు మళ్లించడంలో విజయం సాధించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడంలో సఫలీకృతుడు కావడంతో యూపీలో బీజేపీ ఘన విజయం సాధ్యమైంది. ఈ విజయంతో యూపీ బీజేపీ సంబరాల్లో మునిగితేలుతోంది.

English summary
It is said that BJP president Amit Shah has expected this up assembly results and BJP huge winning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X