వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంల గందరగోళం... ప్రతిపక్ష పార్టీలపై ఫైర్ అయిన అమిత్ షా

|
Google Oneindia TeluguNews

మరో కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ఉన్న నేపథ్యంలో విపక్షలు ఈవీఎంపై లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విపక్షాల తీరుపై ఫైర్ అయ్యారు. ఓట్ల లెక్కింపుకు ఒక్కరోజు ముందు కాంగ్రెస్ పార్టీ లెక్కింపు ప్రక్రియను ఎలా ప్రశ్నింస్తుందని ఆయన మండిపడ్డారు. ఇక ఈవిఎంలను అనుమానించడం దేశ ప్రజలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే ఈసీ గైడ్‌లైన్స్ కు అనుగుణంగానే బీజేపీ వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

కాగా ఎన్నికల కమీషన్ పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహిరిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. కాగా విపక్షాలు వీవీ ప్యాట్‌లను లెక్కించిన తర్వాతే ఈవీఎంల లెక్కింపు ప్రారంభించాలని కోరడంతోపాటు 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను ఈసీ లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.దీంతో ఈసీ వారి ప్రతిపాదనను తిరస్కరించింది.ఈనేపథ్యంలోనే అమిత్ షా వారిపై మండిపడ్డారు.

Amit Shah fire on opposition parties

కాగా గత కొద్దిరోజులుగా 50 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని 21 ప్రతిపక్ష పార్టీలు ఆందోళన కొనసాగిస్తున్నాయి.ఈనేపథ్యంలోను కోర్టు సైతం వెళ్లాయి.అక్కడ కూడ ఎదురు దెబ్బతగలడంతో రివ్యూ పిటిషన్ సైతం వేశాయి. కాంగ్రెస్ పార్టీతోపాటు చంద్రబాబు, దీనిపై పలు సార్లు ఈసీకి విన్నవించారు. అయితే ఎగ్జిట్‌పోల్స్ పూర్తిగా ఎన్డీఏ పక్షాలకు అనుకూలంగా రావడంతో ఈవీఎంలపై ఆందోళన మరింత ఉదృతం చేశాయి ప్రతిపక్ష పార్టీలు

English summary
bjp National president Amit Shah fire on opposition on evm comments, he asked How the Congress quetioned of election counting process one day before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X