వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురితో బిజెపి కమిటీ, రేసులో లేని వెంకయ్య

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బిజెపి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ముగ్గురు కేంద్రమంత్రులకు చోటుదక్కింది. అయితే రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు లేడని తేటతెల్లమైంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బిజెపి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ముగ్గురు కేంద్రమంత్రులకు చోటుదక్కింది. అయితే రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు లేడని తేటతెల్లమైంది.

కొంతకాలంగా రాష్ట్రపతి అభ్యర్థి రేసులో వెంకయ్యనాయడు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు.అయితే బిజెపి తాజాగా ప్రకటించిన కమిటీలో వెంకయ్యకు చోటు దక్కడంతో ఆయన రాష్ట్రపతి పదవికి రేసులో లేడని తేటతెల్లమైంది.

Amit Shah forms presidential poll panel in BJP

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బిజెపి ముగ్గురు మంత్రులతో కమిటిని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీలకు బిజెపి చోటు కల్పించింది.

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఈ ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం ఎన్ డి ఏ పక్షాలతో చర్చించనుంది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థిని ఎంపిక చేయనుంది.

ఎన్ డి ఏ పక్షాలతో చర్చించి త్వరగానే అభ్యర్థిని ప్రకటించాలని బిజెపి జాతీయ నాయకత్వం ఈ కమిటీకి సూచించింది. మరో వైపు ఎన్ డి ఏ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ మేరకు ఎన్ డి యేతర పక్షాలు అభ్యర్థిని బరిలోకి దింపనున్నాయి.

English summary
Amit Shah formed a three members committee for presidential poll panel in BJP. This committee consultations with NDA parties for president candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X