• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన

|

అస్సాంలో ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా ఆ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వరుసగా తాయిలాలు ప్రకటిస్తున్నది. శనివారం నాడు అస్సాంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మొత్తం 1.06లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, ఆదివారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదే అస్సాంకు మరో భారీ ప్యాకేజీ ప్రకటించారు.

వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మంత్రి అమిత్ షా అస్సాంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల టూర్ కోసం ఆదివారం రాష్ట్రానికి చేరుకున్న ఆయన.. బోడో ల్యాండ్ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న కోక్రాఝర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగించారు. ప్రధాని మోదీ సారధ్యంలోని బీజేపీతోనే అస్సాంలో ఉగ్రవాదం, అవినీతి అంతం అవుతాయని షా తెలిపారు.

amit shah in assam: announces rs.500 cr to Bodo region, says bjp will end corruption

ప్రత్యేక ప్రాంత ప్రతిపత్తి కోసం బోడో ల్యాండ్ ఉద్యమం తీవ్రతరమై, హింస ప్రజ్వరిల్లగా, దానిని నిర్మూలించే క్రమంలో కేంద్ర సర్కారు ఆదేశాల మేరకు అస్సాం ప్రభుత్వం బోడో తీవ్రవాదులతో ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ అకార్డ్ (BTR) గా పిలిచే ఈ ఒప్పందానికి నేటితో ఏడాది పూర్తయిన సందర్బాన్ని గుర్తు చేస్తూ.. ఆ ఒప్పందం ప్రకారం బోడో ల్యాండ్ ప్రాంతంలో అభివృద్ధి పనులకుగానూ కేంద్రం నుంచి రూ.500 కోట్లు అందజేస్తున్నట్లు షా ఆదివారం నాడు ప్రకటించారు.

జగన్‌కు ఆయుధాలిచ్చిన నిమ్మగడ్డ -ఆ వ్యాఖ్యలతో ఎస్ఈసీ ఇరుక్కుపోయారా? -సుప్రీంకోర్టులో వ్యూహం ఇదే!

అస్సాంలో బోడో తీవ్రవాదులతోగానీ, ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద సంస్థలతోగానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో ఎప్పందాలు చేసుకుందని, అయితే వాటిలో ఏ ఒక్కటీ సఫలం కాలేదని, బీజేపీ నేతృత్వంలో ఒప్పందాలు కుదిరిన తర్వాతే ఈశాన్యభారతంలో శాంతి ఏర్పడిందని అమిత్ షా గుర్తు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అస్సాంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా,

ఈ ఏడాది మార్చి-మేలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అస్సాంలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కీలక చర్యకు ఉపక్రమించింది. ఆ రాష్ట్రంలో ముస్లింలకు ప్రధాన నాయకుడిగా, 'ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏయూడీఎఫ్) పార్టీ అధినేతగా ఉన్న భద్రుద్దీన్ అజ్మల్ తో కాంగ్రెస్ పొత్తును ఖరారు చేసుకుంది. భద్రుద్దీన్ పార్టీ సహా సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), అంచాలిక్ గణమోర్చా పార్టీలతో కలిసి కాంగ్రెస్ మహా కూటమిని ఏర్పాటు చేసింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో అస్సాం గణపరిషత్ భాగస్వామిగా ఉంది.

English summary
Union home minister Amit Shah on Sunday said that only the BJP under the leadership of PM Modi can turn Assam free of corruption, terrorism and pollution. shah announced that rs. 500 crore had been sanctioned to build a road network in the Bodo region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X