వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ సంక్షోభానికి నెహ్రు తప్పిదాలే కారణం.. ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పు : అమిత్‌షా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కశ్మీర్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంక్షోభానికి ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రు తప్పిదాలే కారణమని ఆరోపించారు. కశ్మీర్ అంశంపై ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పుగా అభివర్ణించారు. అంతేకాదు చార్టర్ ఎంపిక కూడా మరో తప్పిదమని వ్యాఖ్యానించారు. చార్టర్ 35కు బదులు 51ని ఎంచుకోవాల్సిందని అన్నారు.

చరిత్రను రాసే అవకాశం కొద్ది మందికే పరిమితం కావడంతో అది వక్రీకరించబడిందని అన్నారు అమిత్ షా. అందుకే నిజాలు మరుగున పడి అబద్దాలు రాజ్యమేలాయని ఎద్దేవా చేశారు. 1947 నుంచి కూడా కశ్మీర్ అంశాన్ని వివాదస్పదం చేస్తూ కశ్మీర్ చరిత్రకు పాతర వేశారని మండిపడ్డారు. అదలావుంటే కశ్మీర్ పండిట్స్ వలసలు పోయినప్పుడు మానవ హక్కుల కార్యకర్తలుగా గొంతులు చించుకుంటున్నవారు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు.

యెల్లో యెల్లో తంగేడు పూలు.. మల్లెను మించిన గునుగు పూలు.. బతుకమ్మ సంబురాలు షురూయెల్లో యెల్లో తంగేడు పూలు.. మల్లెను మించిన గునుగు పూలు.. బతుకమ్మ సంబురాలు షురూ

Amit Shah made allegations on Ex Prime Minister Jawaharlal Nehru

ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటనతో.. కశ్మీర్‌ లోని కొంతమేర పాకిస్థాన్ గద్దలా తన్నుకు పోయిందని వ్యాఖ్యానించారు అమిత్ షా. అప్పటి హోం మంత్రి, ఉప ప్రధాని సర్దార్ పటేల్‌ను సంప్రదించకుండానే నెహ్రు ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆనాడు కాల్పుల విరమణకు ముందు ఒకసారి సర్దార్ పటేల్‌ను నెహ్రూ సంప్రదించి ఉంటే ఈనాడు కశ్మీర్‌లో ఉగ్రవాద సమస్య ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

ఆర్టికల్ 370 వల్లే కశ్మీర్ ఇబ్బందుల పాలయిందన్నారు అమిత్ షా. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతోనే కశ్మీర్‌కు, దేశానికి మధ్య ఇంతలా అంతరం పెరిగిందని మండిపడ్డారు.

English summary
Central Home Minister Amit Shah made allegations on Ex Prime Minister Jawaharlal Nehru and Congress Governments in Kashmir Issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X