వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్ధ విరోధి కలిసి భోజనం.. అంతలోనే నిప్పుల వర్షం.. దీదీ-షా లంచ్ ఫొటోలు వైరల్

|
Google Oneindia TeluguNews

నిప్పు-ఉప్పు ఎదురుపడితే ఎలా ఉంటుంది? చిటపటలతో మొదలై భగ్గున మంటపుడుతుంది. కానీ ఇవాళొక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. నిత్యం నిదారోపణలు చేసుకూంటూ బద్ధ శత్రువుల్లా వ్యవహరించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొద్ది నిమాషాల పాటు గొడవల్ని పక్కనపెట్టారు. కలిసి భోజనం చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. తినడం పూర్తయిన గంటలోపే పరస్పర విమర్శలతో మళ్లీ నిప్పులు రాజేశారు.

Recommended Video

3 Minutes 10 Headlines | AP EAMCET 2020 Notification | COVID-19 Update
ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం దేశాన్ని ఐదు జోన్లుగా గుర్తించే కేంద్ర హోం శాఖ నిర్ణీత కాలవ్యవధిలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తుండటం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో శుక్రవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ (ఈజెడ్‌సీ) సమావేశం జరిగింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనివార్య కారణాల మీటింగ్ కు రాలేదు. సమావేశం తర్వాత నేతలందరూ కలిసి ఒడిశా సీఎం నవీన్ ఇంట్లో లంచ్ చేశారు. షా, దీదీ ఎదురెదురుగా కూర్చొని భోజనం చేస్తున్న ఫొటోలు వైరలయ్యాయి.

ఎంతో రుచిరా..

ఎంతో రుచిరా..

ఈజెడ్‌సీ వైస్ చైర్మన్ గా కొనసాగుతోన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన అదికారిక నివాసం ‘నవీన్ నివాస్' లో నేతలకు లంచ్ ఏర్పాటు చేశారు. దీదీ, షా, నితీశ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి భోజనం చేస్తున్న ఫొటోను నవీన్ షేర్ చేశారు. వీళ్లందరితో ఇలా గడపడం చాలా సందోషంగా ఉందని, ఒడిశా ప్రత్యేక రుచులను అతిథులకు వడ్డించామంటూ నవీన్ ట్వీట్ చేశారు. ఈ ఫొటో పోస్టయిన గంట తర్వాత సీన్ మళ్లీ రిర్సైంది..

అంతలోనే విమర్శలు..

అంతలోనే విమర్శలు..


ఈజెడ్‌సీ భేటీ, నవీన్ ఇంట్లో లంచ్ ముగిసిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతుగా బీజేపీ నిర్వహించన సభలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెల్చుకున్న తర్వాత షా ఒడిశా రావడం ఇదే తొలిసారి కావడంతో రాష్ట్ర పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు తీర్మానాలు చేసిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలపై అమిత్ షా ఫైరయ్యారు.

ప్రతిపక్షాలను నమ్మకండి..

ప్రతిపక్షాలను నమ్మకండి..

సీఏఏ వల్ల దేశంలోని ఏ పౌరుడికి కూడా అన్యాయం జరగదని, దీనిపై కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ లాంటి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా చెప్పారు. సీఏఏ పౌరసత్వం ఇచ్చే చట్టమేగానీ, దాన్ని రద్దుచేసే చట్టం కాదని స్పష్టంచేశారు. ఈజెడ్‌సీ భేటీ ప్రోటోకాల్ కాల్ ప్రకారం జరిగిందే కావొచ్చు.. సీఏఏ మద్దతు సభ పూర్తిగా రాజకీయపరమైందే కావొచ్చు... అయితే గంటల వ్యవధిలోనే నేతల వ్యవహార శైలిలో తేడాలపై చర్చ జరుగుతోంది.

English summary
Union Home Minister Amit Shah and West Bengal Chief Minister Mamata Banerjee were seen dining together courtesy Odisha Chief Minister Naveen Patnaik. after that Amit Shah participated at a pro-CAA rally in Odisha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X