వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక దేశం ఒక కార్డు: ఆధార్‌కు గుడ్‌బై ..అమిత్ షా వ్యాఖ్యలు దేనికి సంకేతం?

|
Google Oneindia TeluguNews

ఒకే దేశం ఒకే భాష అంశంపై వ్యాఖ్యానించి విమర్శల పాలైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... తాజాగా ఒకే దేశం ఒకే కార్డు ఉండాలని అన్నారు. ప్రస్తుతం భారత పౌరులకు ఉన్న పాస్‌పోర్టు, ఆధార్, ఓటర్‌కార్డు, బ్యాంక్ ఖాతా అన్నిటికీ కలిపి ఒకే కార్డు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయంను వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

Howdy Modi: అమెరికా సెనేటర్ భార్యకు మోడీ సారీ.. ఎందుకో తెలుసా..!!! (వీడియో)Howdy Modi: అమెరికా సెనేటర్ భార్యకు మోడీ సారీ.. ఎందుకో తెలుసా..!!! (వీడియో)

2021 జనాభా లెక్కలు

2021 జనాభా లెక్కలు

2021లో జనాభా లెక్కల సందర్భంగా కేంద్రం రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు చెప్పిన షా... ప్రభుత్వం జాతీయ జనాభా పట్టికను కూడా తయారు చేస్తుందని చెప్పారు. దేశంలోని జనాభాకు సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ విధానంలో సేకరిస్తామని ఇందుకోసం ఓ యాప్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ మొబైల్ యాప్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకుంటామని చెప్పారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా.

 2020 కల్లా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌ తయారు

2020 కల్లా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌ తయారు

ఇక పేపర్ విధానానికి గుడ్‌బై చెప్పి అంతా డిజిటల్‌లోనే జరుగుతుందని అమిత్ షా చెప్పారు. 2011లో జనాభా లెక్కింపు సందర్భంగా అన్ని గణాంకాలను పేపర్‌పై అధికారులు రాశారు. ఒక వ్యక్తి మరణిస్తే వెంటనే జనాభా డేటాలో సమాచారం అప్‌డేట్ చేయగలిగే వ్యవస్థ రావాలని అన్నారు అమిత్ షా. సెప్టెంబర్ 2020కల్లా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌ను తయారు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒకసారి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పూర్తయిన తర్వాత పాన్ ఇండియా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్‌కు ఇదే ఆధారంగా మారుతుందని చెప్పారు. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఎన్ఆర్‌సీని ఎలాగైతే తీసుకొచ్చామో ఎన్‌పీఆర్‌ను కూడా అదే పద్ధతిలో తీసుకొస్తామని చెప్పారు అమిత్ షా.

 జనాభా లెక్కింపుతో ప్రజలకు ప్రభుత్వ పథకాలు

జనాభా లెక్కింపుతో ప్రజలకు ప్రభుత్వ పథకాలు

జనాభా లెక్కింపు ద్వారా ప్రజలకు అందవలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పిన అమిత్ షా... ప్రజలు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారికి అన్ని లబ్ధిలు ప్రభుత్వం నుంచి చేకూరుతాయని వివరించారు. దేశంలో తలెత్తే ఎన్నో సమస్యలకు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పరిష్కారం చూపుతుందని అన్నారు. 2011 జనాభా లెక్కలతో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లను ప్రభుత్వం అర్హులకు ఇవ్వడం జరిగిందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

ఒకవేళ అన్నిటికీ ఒకే కార్డు తీసుకొస్తే భారత పౌరుడిగా చెబుతూ ప్రతిఒక్కరి దగ్గర ఉండే ఆధార్ కార్డుకు కాలం చెల్లుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఒకే దేశం ఒకే కార్డు వస్తే ఆధార్‌కు గుడ్‌బై చెప్పాల్సి వస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
After One Country One Language remarks, Union Home Minisiter Amit Shah made some interesting comments. He expressed his view that a single multipurpose id card will be enough for the citizens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X