బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఆంధ్రాలో అధికారంలోకి వస్తాం, అమిత్ షా జోస్యం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాషాయ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం అంటూ కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ దేశం పరువు తీస్తోందని, వెంటనే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. తాము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏరోజూ ఉగ్రవాదులతో పోల్చలేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తామని అమిత్ షా జోస్యం చెప్పారు.

బసవేశ్వర జయంతి

బసవేశ్వర జయంతి

బెంగళూరులో బుధవారం 885వ బసవేశ్వర జయంతి సందర్బంగా బసవేశ్వర విగ్రహానికి అమిత్ షా పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బసవేశ్వర జయంతి సందర్బంగా తాను బెంగళూరులో ఉండటం చాల సంతోషంగా ఉందని అమిత్ షా అన్నారు. ప్రతిఒక్కరికి విద్య, సమాజంలో అందరూ సమానం అని చాటి చెప్పిన బసవేశ్వరుడు మన అందరికీ స్పూర్తి అని అమిత్ షా గుర్తు చేశారు.

జాతి, మతం లేదు

జాతి, మతం లేదు

ఉగ్రవాదులకు జాతి, మతం ఏమీ లేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదులు అందరూ ఉగ్రవాదులే, అందులో హిందూ ఉగ్రవాదులు, కాషాయం ఉగ్రవాదులు ఉండరని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలని, లేదంటే ప్రజలే ఆ పార్టీ నాయకులకు సరైన బుద్ది చెబుతారని అమిత్ షా హెచ్చరించారు.

బెంగళూరులో శక్తి కేంద్రం

బెంగళూరులో శక్తి కేంద్రం

బెంగళూరు ప్యాలెస్ మైదనంలో నగరంలోని 28 శాసన సభ నియోజక వర్గాలకు చెందిన శక్తి కేంద్ర ప్రముఖులను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. సీఎం సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన తరువాత కర్ణాటకలో 25 మంది హిందూ సంఘ, సంస్థల కార్యకర్తలు హత్యకు గురైనారని, ఇలాంటి కిరాతక ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదని అమిత్ షా అన్నారు.

ఆంధ్రా, తెలంగాణలో అధికారం

ఆంధ్రా, తెలంగాణలో అధికారం

కర్ణాటకలో ఈ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలవాలని, అందుకూ మీ అందరి సహకారం కావాలని అమిత్ షా మనవి చేశారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కర్ణాటక కేంద్ర బిందువు కావాలని అన్నారు. తరువాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో అధికారంలోకి వస్తామని అమిత్ షా జోస్యం చెప్పారు.

మోడీ టీ అమ్మితే నేను పోస్టర్లు వేశాను

మోడీ టీ అమ్మితే నేను పోస్టర్లు వేశాను

టీ అమ్ముకుంటున్న నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని, పోస్టర్లు వేసుకుంటున్న తాను ఈ రోజు ప్రముఖ జాతీయ పార్టీ అయిన బీజేపీ అధ్యక్షుడిని అయ్యానని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఉత్తర భారత దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ హవా, కార్యకర్తల కష్టంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అమిత్ షా అన్నారు.

English summary
Today BJP national president Amit Shah addresses Shakthi Kendra Pramukhs of 28 assembly constituencies of Bengaluru division. He slams congress for the usage of the word Saffron Terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X