వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ ట్వీట్‌పై దుమారం .. గాంధీ కుటుంబమని పొగరని బీజేపీ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : యోగాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అవమానించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. యోగా అంటే రాహుల్ కు గిట్టదా ? మరి ఇంత చులకనగా ట్వీట్ చేస్తారా అని ప్రశ్నించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత .. ట్రిపుల్ తలాక్‌పై కూడా ఉందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకే ఆ పార్టీ ట్రిపుల్ తలాక్ కు మద్దతిస్తున్నట్టు అర్థమవుతుందన్నారు.

ఏం జరిగిందంటే ..?
యోగా డే సందర్భంగా భారత సైన్యం, యోగా డేకు సంబంధించిన ఫోటో, కుక్కల ఫోటోలను రాహుల్ ట్వీట్ చేశారు. యోగా డే అంటే ఏం లేదు .. సైనికులు, కుక్కలు యోగం చేయడం అర్ధం వచ్చేలా పోస్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీ, వారి కుక్కలు చేసే యోగా ఫోటోల క్యాప్షన్ కూడా ఇచ్చారు రాహుల్. ఇది నవభారతం, సైనికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం కోసం త్యాగం చేశారని కొనియాడారు. అయితే రాహుల్ పోస్ట్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Amit Shah slams Rahul Gandhi for mocking Yoga Day, calls it Congress negativity

ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోవడంతో రాహుల్ ఆలోచన మందగించిందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా రాహుల్ గాంధీ ఆలోచన సరళిని మార్చలేదని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శించారు. భారత సైన్యాన్ని, కుక్కలకు సంబంధించిన విభాగాన్ని రాహుల్ గాంధీ విమర్శించారని మండిపడ్డారు.

సరికాదు ..
రాహుల్ అంటే గౌరవం. కానీ ఆయన చేస్తున్న ట్వీట్లు మాత్రం ఆయన గౌరవాన్ని తగ్గించేట్టుగా ఉంది. ఎండనక, వాననక పనిచేస్తున్న సైన్యాన్ని తక్కువ చేసి చూపడం సరికాదన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. మన దేశ రక్షణ కోసం అనునిత్యం పోరాడుతున్న వారిని తగ్గించి చూడటం సరికాదని సూచించారు. ఈ మేరకు రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.

బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ కూడా రాహుల్‌ వైఖరిని తప్పుపట్టారు. రాహుల్ ట్వీట్‌తో ఆ శునకాలు సిగ్గుపడుతున్నాయని పేర్కొన్నారు. ఇది కేవలం గాంధీ కుటుంబమని పొగరు మాత్రమేనని స్పష్టంచేశారు. అవి కుక్కలే .. కానీ అవి మన దేశం పనిచేస్తున్నాయి .. వాటికి మేం సెల్యూట్ చేస్తున్నామని స్పష్టంచేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

English summary
Union Home Minister Amit Shah slammed Rahul Gandhi and Congress over Rahul Gandhi's tweet mocking Yoga Day and armed forces on Friday. Amit Shah said, "Congress tweets about negativity." "Congress's negativity is seen in support of triple talaq, now they mock Yoga Day and insult forces," Amit Shah said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X