వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా-రాహుల్‌లకూ షాకిచ్చాం!, మాయవతిపై నో: అమిత్ షా

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్పందించారు. ఇది ప్రజా విజయం అన్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మూడోంతుల సీట్లు సాధించామన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్పందించారు. ఇది ప్రజా విజయం అన్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మూడోంతుల సీట్లు సాధించామన్నారు.

<strong>డింపుల్ యాదవ్ వచ్చినా.. సీఎం కావాలనుకున్న అపర్ణకు షాక్</strong>డింపుల్ యాదవ్ వచ్చినా.. సీఎం కావాలనుకున్న అపర్ణకు షాక్

గోవా, మణిపూర్‌లలోను తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. భారీ విజయం ఇచ్చిన యూపీ ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. ఇది ప్రజా విజయమన్నారు. ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు బాధ్యతను పెంచాయన్నారు. మిత్ర పక్షాలకు కేబినెట్లో చోటు కల్పిస్తామన్నారు.

అమేథి, రాయ్‌బరేలీలలో మాదే గెలుపు

అమేథి, రాయ్‌బరేలీలలో మాదే గెలుపు

ప్రధాని మోడీ నిర్ణయాలకు ప్రజలు సహకరిస్తున్నారని చెప్పారు. అమేథి, రాయ్ బరేలిలలో పది సీట్లలో మేం ఆరు సీట్లు గెలిచామని చెప్పారు. ప్రధాని మోడీ పట్ల విపక్షాలు దుష్ప్రచారం చేసినా ప్రజలు అండగా నిలిచారన్నారు.

మాయావతి మానసిక స్థితి గురించి మాట్లాడను

మాయావతి మానసిక స్థితి గురించి మాట్లాడను

మాయావతి మానసిక స్థితి పైన తాను కామెంట్ చేయదల్చుకోలేదని చెప్పారు. మాయావతి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని చెప్పారు.

మోడీదే విజయం

మోడీదే విజయం

కులం, మతం, ప్రాంతం ఏదీ పని చేయలేదన్నారు. కేవలం ప్రధాని మోడీ అభివృద్ధి మంత్రం పని చేసిందని చెప్పారు. దేశంలోని పేదలంతా మోడీ వైపు చూస్తున్నారన్నారు. ఎన్నికల ఫలితాలు తమకు మరింత ఉత్సాహాన్నిచ్చాయన్నారు.

కార్యకర్తల శ్రమ ఫలితం

కార్యకర్తల శ్రమ ఫలితం

మోడీ నాయకత్వానికి, కార్యకర్తల శ్రమ ఫలితం ఇది అన్నారు. ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. యూపీ అభివృద్ధికి ఈ విజయం తోడ్పడుతుందన్నారు. పంజాబ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నామని, ఓ ఓటమిని విశ్లేషించుకుంటామని అమిత్ షా చెప్పారు. పంజాబ్‌లో తమకు ఇరవై శాతానికి పైగా ఓట్లు వచ్చాయని చెప్పారు.

గాయత్రి ప్రజాపతి లొంగిపోతే మంచిది

గాయత్రి ప్రజాపతి లొంగిపోతే మంచిది

రేప్ కేసులో నిందితుడైన మంత్రి గాయత్రీ ప్రజాపతి లొంగిపోతే మంచిదని అమిత్ షా హెచ్చరించారు. లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. తాము ఇచ్చిన హామీలను అన్నింటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. నోట్ల రద్దు ప్రభావం ఎన్నికల్లో కనిపించలేదన్నారు. మోడీ ప్రధాని అయినా వారణాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీనే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అత్యంత ప్రజాధరణ కలిగిన నేత మోడీ అన్నారు.

English summary
Amit Shah speaks to media as BJP headed for UP, Uttarakhand election wins, thanks people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X