వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా: హోం ఐసోలేషన్‌లోనే, అందరికీ ధన్యవాదాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హోంమంత్రి అమిల్ షా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, తాను కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు.

Recommended Video

Amit Shah Tests Coronavirus Positive ఆస్పత్రిలో చేరుతున్నా అని అమిత్ షా ట్వీట్ ! || Oneindia Telugu

అయితే, వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులపాటు హోం ఐసోలేషన్‌లో హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు అమిత్ షా చెప్పారు. దేవుడి తయతో తాను కోలుకున్నట్లు తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తనకు వైద్యం అందించిన మేదాంత ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి కేంద్రమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 2న తనకు కరోనా సోకినట్లు అమిత్ షా స్వయంగా వెల్లడించారు. అంతకుముందు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లు హాజరైన కీలక సమావేశంలో అమిత్ షా పాల్గొనడం గమనార్హం.

Amit Shah Tests Negative For COVID-19, To Be In Home Isolation For Few Days

అయితే, ఈ సమావేశంలో భౌతిక దూరం లాంటి కరోనా నిబంధనలను పూర్తిగా అమలు చేశారు. ఈ భేటీలోనే నూతన జాతీయ విద్యా విధానంకు ఆమోద ముద్ర వేశారు. కాగా, తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్ ఉండాలని హోంమంత్రి అమిత్ షా కోరిన విషయం తెలిసిందే.

దేశంలోని పలువురు ప్రముఖులు కూడా కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తోపాటు పలువురు సీనియర్ నాయకులు కరోనా బారినపడ్డారు. శివరాజ్ సింగ్, యడ్యూరప్ప ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.

కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 24,83,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 6,64,033 యాక్టివ్ కేసులున్నాయి. 17,70,682 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 48,367 మంది మరణించారు.

English summary
Home Minister Amit Shah today tweeted he has tested negative for coronavirus. He had been staying at the private hospital Medanta in Gurgaon, near Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X