వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏ-2: కేంద్ర కేబినెట్‌లో అమిత్ షా? కీల‌క పోర్ట్ ఫోలియో కూడా రెడీ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా.. ఇక కేంద్ర ప్ర‌భుత్వంలోనూ చక్రం తిప్ప‌బోతున్నారా? ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆత్మ‌గా గుర్తింపు పొందిన ఆయ‌నకు మంత్రివ‌ర్గంలో బెర్త్ ఖాయ‌మైందా? అవుననే అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. కేంద్రంలో ఎన్డీఏ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగితే..అమిత్ షాను కేబినెట్‌లో తీసుకుంటార‌నే వార్త దేశ రాజ‌ధానిలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అత్యంత కీల‌క‌మైన ర‌క్షణ మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌ల‌ను అమిత్ షాకు అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మంగ‌ళ‌వారం సాయంత్రం కేంద్రమంత్రుల‌తో పాటు ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు అమిత్ షా ఇచ్చిన విందులో ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. జాతీయ అధ్య‌క్షుడిగా పార్టీ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టిన ఆయ‌న‌.. ఇక మంత్రిగా ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల్లో భాగస్వామ్యం అవుతార‌ని పార్టీ నాయ‌కులు అంటున్నారు. రాఫెల్ ఒప్పందాల‌తో మ‌స‌క బారిన‌ట్టుగా భావిస్తోన్న ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌తిష్ఠ‌ను ఇనుమ‌డింప చేయ‌డానికి అమిత్ షా ఒక్క‌రే స‌మ‌ర్థుడ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సైతం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Amit Shah, the next Defence Minister?

నిజానికి- రెండేళ్ల కింద‌టే అమిత్ షాను ఇదివ‌ర‌కే మంత్రివ‌ర్గంలో తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌ను ఆయ‌న‌కు అప్ప‌గిస్తార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో ఆయ‌న కేబినెట్‌లో చేర‌డానికి సిద్ధ ప‌డ‌లేదు. ఎన్నిక‌లకు రెండేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉండటం వ‌ల్ల అటు పార్టీ వ్య‌వ‌హారాలు, ఇటు ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌నే ఉద్దేశంతో అప్ప‌ట్లో అమిత్ షా ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను అంగీక‌రించ‌లేదు.

ఈ సారి ఆయ‌న‌ను కేబినెట్‌లో తీసుకుని తీరాల‌ని పార్టీలోకి కొంద‌రు కీల‌క నాయ‌కులు అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా అమిత్ షా కాల ప‌రిమితి ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ముగియ‌బోతోంది. వ‌రుస‌గా రెండోసారి ఆయ‌నకే పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తారా? లేక మ‌రెవ‌రికైనా అవ‌కాశం ఇస్తారా? అనే అంశం మీదా చ‌ర్చించిన‌ట్లు చెబుతున్నారు. ఎలాగూ మ‌రో ఆరు నెల‌ల్లో పార్టీ అధ్య‌క్ష కాల ప‌రిమితి ముగియ‌బోతున్నందున అమిత్ షాను కేబినెట్‌లోకి తీసుకుంటేనే మంచిద‌నే అభిప్రాయాన్ని రాజ్‌నాథ్ సింగ్, ఇత‌ర సీనియ‌ర్లు వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.
అమిత్ షా త‌రువాత పార్టీకి స‌మ‌ర్థ‌వంతంగా దిశా నిర్దేశం చేయ‌గ‌ల స‌త్తా ఎవ‌రికి ఉంద‌నే విష‌యాన్ని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు మంగ‌ళవారం నాటి విందులో ప్రస్తావించిన‌ట్లు తెలుస్తోంది.

English summary
BJP party president Amit Shah’s term ends in December. There is something about the confidence displayed by the BJP top brass about the election result that is a revelation about what his next post will be. Amit Shah File picture: BJP president Amit Shah. There is something about the confidence displayed by the BJP top brass about the election result that is a revelation. Their internal calculations and feedback will be a thesis if it actually works out to the T on May 23rd, Counting Day. And already theories are abuzz in the BJP Headquarters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X