• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కశ్మీర్ షెహెన్ షా అమిత్ షా: కేంద్ర హోంమంత్రి బాధ్యతలు ఇందుకోసమేనా..?

|

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, అనంతరం జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ నిర్ణయం తీసుకోవడం వెనక మోడీ-షా ద్వయం పెద్ద హోమ్‌వర్క్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా జమ్ము కశ్మీర్‌ను అంత హడావుడిగా ఒక నిర్ణయం తీసుకుని ఎక్కడా ఎలాంటి అలజడులు జరగకుండా స్మూత్‌గా బిల్లును పాస్ చేయించడం వెనక ఉన్న మాస్టర్ బ్రెయిన్ అమిత్ షా అని చెప్పక తప్పదు. అందుకే కశ్మీర్‌కా షెహన్షా అమిత్ షా అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.

సున్నిత అంశాన్ని నేర్పుగా డీల్ చేసిన అమిత్ షా

సున్నిత అంశాన్ని నేర్పుగా డీల్ చేసిన అమిత్ షా

జమ్మూ కశ్మీర్‌లో అడ్డంకిగా మారిన ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆ రాష్ట్రానికి రాష్ట్ర హోదా తీసేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యంత సున్నితమైన వ్యవహారాన్ని ఎంతో నేర్పుగా డీల్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎక్కడా ఎలాంటి అలజడులకు ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తుగానే అన్ని భద్రతా చర్యలు తీసుకుని పావులు ముందుకు కలిపారు. జమ్మూ కశ్మీర్‌కు వ్యతిరేకంగా ఏ చిన్న ప్రకటన వచ్చినా కూడా అక్కడ చెలరేగే ఆందోళనలు, హింసా కాండా అంతా ఇంతా కాదు. కానీ ఈ సారి ఏకంగా జమ్ము కశ్మీర్‌నే విభజిస్తున్నట్లు వచ్చిన అతిపెద్ద ప్రకటనతో రావణకాష్టలా ఆ రాష్ట్ర పరిస్థితి తయారవుతుందని అంతా ఊహించారు. కానీ ఇంత వరకు ఒక్క అవాంఛనీయ ఘటన కూడా జరిగినట్లు సమాచారం లేదు. అంటే అక్కడి యువత రోడ్లపైకొచ్చి రాళ్లు రువ్వడం లాంటి హింసాత్మక ఘటనలు కూడా పెద్దగా జరిగినట్లు ఎక్కడా కనిపించలేదు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయడంలో అమిత్ షా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాతే తాననుకున్నది చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కశ్మీర్ కోసమే అమిత్ షాకు కేంద్ర హోంమంత్రి బాధ్యతలు..?

కశ్మీర్ కోసమే అమిత్ షాకు కేంద్ర హోంమంత్రి బాధ్యతలు..?

2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత అఖండ విజయం సాధించిన బీజేపీ రెండో సారి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచే జమ్ము కశ్మీర్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే హోంమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్‌ను కాదని అనూహ్యంగా అమిత్‌షాకు కేంద్ర హోంశాఖ బాధ్యతలను అప్పగించారు ప్రధాని మోడీ. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అమిత్ షా పనిచేయగలరనే నమ్మకం ప్రధాని మోడీకి ఏర్పడింది. జమ్మూ కశ్మీర్ పై ఒక నిర్ణయం ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు దానిపై నిర్ణయం జరిగే అవకాశం ఉండదని భావించిన ప్రధాని మోడీ ఈ బాధ్యతను తన ఆప్త మిత్రుడు అమిత్ షాకు అప్పగించారు. ఇందులో భాగంగానే అమిత్ షా జమ్ము కశ్మీర్‌లో పలుమార్లు పర్యటించి అక్కడి పరిస్థితిని స్టడీ చేశారు కూడా. పైగా అమిత్ షా ఏదైనా ఆపరేషన్ చేపట్టినప్పుడు అది సక్సెస్ అయ్యిందే తప్ప ఎప్పుడూ ఓటమి చూడలేదు. అంతలా ఆయన చాణక్యత ప్రదర్శిస్తారు. ఇక జమ్మూ కశ్మీర్‌ విషయంలో కూడా అదే జరిగింది. కేవలం జమ్మూ కశ్మీర్ కోసమే హోంమంత్రి బాధ్యతలు అమిత్ షాకు మోడీ అప్పగించినట్లు తెలుస్తోంది.

అమిత్ షా చేతిలోకి జమ్ము కశ్మీర్, లడఖ్‌

అమిత్ షా చేతిలోకి జమ్ము కశ్మీర్, లడఖ్‌

ఇక జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం వల్ల ఆరాష్ట్రానికి అసెంబ్లీ ఉన్నప్పటికీ కూడా అన్ని కీలక అంశాలు అమిత్ షా చేతిలోకి వెళ్లిపోతాయి. అంటే అన్ని కీలక నిర్ణయాలు కేంద్ర హోంశాఖ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు పాక్ ఆక్రమిత్ కశ్మీర్ పీఓకే కూడా కశ్మీర్ భూభాగంలోకి వస్తుందని చెప్పడం ద్వారా అమిత్ షా... పాక్ నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ముందుగా వేర్పాటు వాదులకు చెక్ పెట్టే అవకాశం ఉంది. తద్వారా కశ్మీర్‌లోయలో శాంతిని నెలకొనేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి దేశానికి మోడీ ప్రధాని అయినప్పటికీ కూడా... జమ్ము కశ్మీర్ వరకు మాత్రం అన్ని అధికారాలు అమిత్ షాకే కట్టబెట్టినట్లు స్పష్టమవుతోంది.

హడావుడిగా నిర్ణయం ఎందుకు జరిగింది..?

హడావుడిగా నిర్ణయం ఎందుకు జరిగింది..?

ఇక డిసెంబర్ సమావేశాలు ఉండగా జమ్ము కశ్మీర్‌పై ఇప్పుడే ఎందుకు హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. అంతేకాదు ఎప్పుడూ లేనంతగా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేసి వ్యూహాత్మకంగా పావులు కదిపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో మూడు నెలల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో ఈ మధ్యే ఖాళీ అయిన 17 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉంది. అయితే జమ్ము కశ్మీర్ సెంట్‌మెంట్‌ ద్వారా బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్లు పొలటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక అన్నీ సవ్యంగా సాగితే ఈ మూడు రాష్ట్రాలతో పాటు జమ్ము కశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి అక్కడ కూడా తొలిసారిగా కాషాయం జెండా ఎగురువేయాలనే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది.

 దేశమంతా కాషాయం జెండా ఎగురవేసేందుకేనా..?

దేశమంతా కాషాయం జెండా ఎగురవేసేందుకేనా..?

అంతేకాదు వచ్చే ఏడాది కల్లా పీఓకేపై దాడి చేసి దాన్ని అధికారికంగా భారత్‌లో విలీనం చేసి జమిలీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. అంటే 2024 నాటికి దేశవ్యాప్తంగా కాషాయం జెండా ఎగురవేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు జమ్ము కశ్మీర్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించి అక్కడ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలనే పక్కా ప్లాన్‌తో మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. ఇక బీజేపీ పాలసీ ప్రకారం 75 ఏళ్లు నిండిన వారు పోటీలో నిలవకూడదనేది ఉంది. అందుకే మోడీకి 75 ఏళ్లు నిండక ముందే జమిలీ ఎన్నికలకు వెళ్లి మరో దఫా ప్రధాని అయి ఆ తర్వాత ప్రధానిగా అమిత్ షాకు లైన్ క్లియర్ చేసేందుకు రాజకీయంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

మొత్తానికి అమిత్ షా కశ్మీర్‌కు షెహన్షా అని చెప్పక తప్పదు. జమ్ము కశ్మీర్‌‌లో అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, రెండే కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం దానిపై కొన్ని పార్టీలు తప్పితే మెజార్టీ పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. దీంతో బీజేపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని దేశంలోని ప్రజలు, పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Article 360 in Jammu Kashmir was abrogated and Jammu Kashmir has been carved out into two union territories.This move by BJP government has been hailed by many. But the master brain behind this histrorical step is Amit Shah. Modi who had strong belief in Amit Shah had handed over the responsibility of decades long Kashmir issue where he carried our succesfully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more