వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సంక్షోభం: అఖిలపక్ష సమావేశానికి అమిత్ షా పిలుపు, 15న భేటీ

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ మేరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆప్, బీఎస్పీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కరోనా నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను అమిత్ షా ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది.

 Amit Shah to chair all-party meeting tomorrow on COVID-19 crisis

పెరుగుతున్న కేసులు.. రికవరీ కూడా ఎక్కువే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ సానుకూల విషయం కూడా ఒకటి మనకు కనిపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులతోపాటు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా, ఆదివారం కరోనావైరస్ రికవరీ రేటు 50 శాతం దాటిందని కేంద్రం వెల్లడించింది.

గత 24 గంటల్లో అత్యధికంగా 11,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 50.60శాతం మంది
కోలుకున్నారని పేర్కొంది. దీంతో దేశంలో వైరస్ సోకిన వారిలో సగం కంటే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. గత రెండు రోజులుగా రోజుకు 11వేల చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ రికవరీ రేటు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరగడం శుభపరిణామమే అని చెప్పవచ్చు.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,49,348 యాక్టివ్ కేసులుండగా, 1,62,378 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక 9,195 మంది కరోనావైరస్ బారినపడి మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం హోంమంత్రి అమిత్ షా కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను బలోపేతం చేస్తామని తెలిపారు.

ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో పెంచుతామన్నారు. అదేవిధంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, ఆస్పత్రుల్లో బెడ్ల కొరతను నివారించడానికి 500 రైల్వే కోచ్‌లను కరోనా బాధితులకు కేటాయిస్తామన్నారు. ఢిల్లీలో పరీక్షలను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. కాగా, ప్రస్తుతం 3,24,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ 1,50,581 యాక్టివ్ కేసులుండగా, 1,65,274 మంది కోలుకున్నారు. 9283 మంది కరోనా బారిన పడి మరణించారు.

English summary
Home minister Amit Shah has called an all party meeting tomorrow to review the COVID-19 situation in the national capital amid spike in cases over the last two weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X