వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ ముందుకు పౌరసత్వ బిల్లు: బీజేపీ సభ్యులకు విప్‌ జారీ: చర్చ..ఆమోదానికి వ్యూహం..!

|
Google Oneindia TeluguNews

బీజీపీ కీలకంగా భావిస్తున్న పౌరసత్వ చట్ట సవరణ బిల్లు మరి కాసేపట్లో పార్లమెంట్ ముందుకు రానుంది. ఆరు దశాబ్దాల పౌరసత్వ చట్టంలో సవరణకు రంగం సిద్ధమైంది. పౌరసత్వ (సవరణ) బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేవ పెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లో మత పీడనకు గురై అక్కడి నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఆ మూడు దేశాల నుంచి 2014 డిసెంబరు 31వ తేదీలోపు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించరు.దీనిపై అదే రోజు చర్చించి, బిల్లుకు ఆమోదం కూడా తెలపాలని భావిస్తున్నారు. ఇప్పటికే మూడు రోజుల పాటు సభకు సభ్యులంతా తప్పని సరిగా హాజరవ్వాలంటూ బీజేపీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది.

సభ ముందుకు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు

సభ ముందుకు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు

చారిత్రక నేపథ్యం ఉన్న మరో కీలక బిల్లు సవరణ కోసం నేడు కేంద్రం పార్లమెంట్ ముందుకు తీసుకొస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ (సవరణ) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
ఆరు దశాబ్దాల పౌరసత్వ చట్టంలో సవరణ దిశగా ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రతిపాదిస్తున్నారు. ఈ బిల్లును ఆమోదిస్తే ప్రధానంగా మూడు దేశాల్లోని పాకిస్థాన్..బంగ్లాదేశ్..అఫ్ఘానిస్థాన్‌లో వివక్షకు గురై..అక్కడి నుండి మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఆ మూడు దేశాల నుంచి 2014 డిసెంబరు 31వ తేదీలోపు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించని విషయాన్ని బిల్లులో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ బిల్లు పైన బీజేపీ..కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది.

బీజేపీ సభ్యులకు విప్ జారీ

బీజేపీ సభ్యులకు విప్ జారీ

పొరుగు దేశాల్లో మత పీడనకు గురై శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని, దేశాన్ని మతపరంగా విభజించాలన్న నిర్ణయానికి వారంతా బాధితులని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ వ్యాఖ్యానించారు. ఈ బిల్లును కొందరు విమర్శిస్తున్నారని, కానీ, 1950లో నెహ్రూ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్నే చేసిందని గుర్తు చేశారు. అణచివేతకు గురైన మైనారిటీలకు భారత్‌ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతుందన్నారు. దీని పైన కాంగ్రెస్ నేతలు భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో పౌరసత్వ (సవరణ) బిల్లుతోపాటు చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా పొడిగింపునకు ఉద్దేశించిన బిల్లును సోమవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో..ఈ రోజు నుండి మూడు రోజుల పాటు సభ్యులంతా సభకు తప్పని సరిగా హాజరవ్వాలంటూ బీజేపీ విప్ జారీ చేసింది.

నేడే చర్చ..బిల్లు ఆమోదం..

నేడే చర్చ..బిల్లు ఆమోదం..

పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ విరుచుకుపడ్డారు. గాంధీజీ ఆలోచనా విధానం పై జిన్నా వాదానికి గెలుపు వంటిదే పౌరసత్వ బిల్లు అని విమర్శించారు. ఈ బిల్లును నిరసిస్తూ 10వ తేదీన బంద్‌ పాటించాలని ఈశాన్య విద్యార్థుల సమాఖ్య పిలుపునిచ్చింది. దీంతో..బిల్లును ప్రవేశ పెట్టిన తరువాత మధ్నాహ్నం చర్చను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజునే చర్చను ముగించి ఓటింగ్ సైతం పూర్తి చేసే విధంగా వ్యూహం సిద్దం చేస్తోంది. అదేవిధంగా, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం నేడు సభలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోటా 2020 జనవరితో ముగియనుంది.

English summary
Central govt is all set to introduce two major bills in loksabha including citizenship (Amendment) bill. This bill will amend the six decade old citizenship act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X