వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు ఇంట్లో అమిత్ షా భోజనం.. వ్యవసాయ చట్టాలపై నిరసన నేపథ్యంలో..

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు (శని,ఆదివారం) హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. తూర్పు మిడ్నాపూర్‌లో గల బలిజ్యూరీ గ్రామంలో ఓ రైతు ఇంట్లో భోజనం చేశారు. ఆయనతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, బీజేపీ స్టేట్ చీఫ్ దిలీప్ ఘోష్ కూడా ఉన్నారు.

వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగానే రైతు ఇంటి వద్ద భోజనం చేశారు. నవంబర్‌లో కూడా అమిత్ షా పర్యటించిన సంగతి తెలిసిందే. తర్వాత మరోసారి టూర్ కొనసాగుతోంది. మిడ్నాపూర్ ర్యాలీ తర్వాత రైతు ఇంటికి అమిత్ షా వచ్చారు.

Amit Shah, Vijayvargiya and other BJP leaders have lunch at Bengal farmers house

తమ ఇంటిలో అమిత్ షా భోజనం చేస్తారని రైతు శానతన్ సింగ్ క్లబ్ సభ్యులకు సమాచారం అందజేశారు. తమ ఇంటికి షా అండ్ కో రావడం సంతోషంగా ఉందన్నారు. తన జీవితంలో ఇలాంటి రోజు వస్తోందని అనుకోలేదని చెప్పారు. తానో రైతునని.. పేద అన్నదాతను చెప్పారు. పప్పుతో అన్నం మాత్రమే పెట్టగలనని చెప్పారు.

Amit Shah, Vijayvargiya and other BJP leaders have lunch at Bengal farmers house

దేశం శాంతి, సౌభ్రాతుత్వంతో ఉండేట్టు చూడాలని అమిత్ షాను కోరానని సింగ్ తెలిపారు. ఇందుకు బీజేపీ కట్టుబడి ఉందని.. తాను కూడా 50 ఏళ్ల పాటు అనుబంధం కలిగి ఉన్నానని వివరించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగుతోంది. ఈ సమయంలో రైతు ఇంటి వద్ద భోజనం చేసి మంచి సంకేతాలను అమిత్ షా ఇచ్చారు.

English summary
Union minister Amit Shah, who is on a two-day visit to Bengal, dined at a farmer’s residence in East Midnapore’s Balijuri village on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X