వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిరిరాజ్ నోరు అదుపులో పెట్టుకో : గీత దాటితే వేటేనన్న అమిత్ షా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పార్టీ నేతల నోటిదురుసు సంకీర్ణ ప్రభుత్వంలో ఇరుకునపెడతాయి. కానీ కొందరు సంకీర్ణ ధర్మాన్ని మరచి విమర్శిస్తుంటారు. అలాగే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా విమర్శించడంతో .. బీజేపీ చీఫ్ అమిత్ షా తలంటాల్సి వచ్చింది.

ఏం జరిగిందంటే ..
ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో జేడీయూ చేరలేదు. ఒకే బెర్త్ ఇస్తామని చెప్పడంతో అలకబూనిన సంగతి తెలిసిందే. తర్వాత బీహర్ క్యాబినెట్‌లో బీజేపీ అభ్యర్థులకు చోటివ్వలేదు. ఇప్పటికే హీట్ మీదున్న పాలిటిక్స్ ఇటీవల కాస్త ఉపశమనం కలిగించే పరిస్థితి ఏర్పడింది. రంజాన్ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీనికి డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ, రాం విలాస్ పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్ హాజరయ్యారు. విందు తర్వాత చిరునవ్వులు చిందిస్తూ పోటో దిగారు. దీనిని గిరిరాజ్ సింగ్ తప్పుపట్టారు. రంజాన్ విందు సందర్భంగా చిరునవ్వులు నవ్వారే .. అదే నవరాత్రి ఉత్సవాలకు ఇంతే ఉత్సాహంగా జరుపుకోరని ప్రశ్నించారు. ఆ నాయకులను ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశారు.

amit shah warned giriraj singh

తప్పుపట్టిన జేడీయూ, ఎల్జేసీ
దీంతో జేడీయూ స్పందించింది. గిరిరాజ్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఆయన మానసిక స్థితి సరిగాలేదని విమర్శించింది. ఎల్జేపీ పార్టీ నుంచి స్పందించింది. గిరిరాజ్ కామెంట్లు సరికాదని విమర్శించింది. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. సొంత పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఇదే మొదటితప్పు అని క్షమించి వదిలేస్తున్నాని తెలిపినట్టు సమాచారం. మరోసారి ఇలాంటి తప్పు చేస్తు చర్యలు తప్పవని హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

English summary
Nitish Kumar Iftar has been given a feast at Ramzan. Deputy Chief Minister Sushil Kumar Modi, Ram Vilas Paswan and Chirag Paswan attended. After the feast, Giriraj Singh has blamed it. At the time of the Ramzan feast, the smile laughs and asks why not celebrate the Navaratri celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X