వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆయనకు పద్మవిభూషణ్ సరిపోదు, భారతరత్న ఇవ్వాల్సిందే', సంతోషం: అమితాబ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ్ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'కు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అన్ని విధాల అర్హుడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆయనకు పద్మవిభూషణ్ సరిపోదన్నారు.

"తన సమకాలికుల మధ్య అమితాబ్ బచ్చన్ లెజెండ్. పద్మవిభూషణ్ సరిపోదు. తనకున్న హబోదాకు ఆయనకు 'భారతరత్న'కు అర్హులు" అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో 'బిగ్ బి' అమితాబ్ కు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలంటూ ఆమె భారత ప్రభుత్వానికి పరోక్షంగా డిమాండ్ చేశారు.

Amitabh Bachchan deserves a Bharat Ratna: Mamata Banerjee

పద్మ విభూషణ్ అవార్డుతో సంతోషం: అమితాబ్

కేంద్ర ప్రభుత్వం తనను పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల బాలీవుడ్ నటుడు అమితాబ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన పట్ల ప్రేక్షుకులు చూపుతున్న అభిమానానికి ఇది నిదర్శనమని అన్నారు.

'దేశ అత్యంత ఉన్నతమైన 'పద్మ' అవార్డుతో భారత ప్రభుత్వం నన్ను గౌరవించింది. ఈ సందర్భంగా నాకు మాటలు రావడం లేదు. చాలా గౌరవప్రదంగా భావిస్తున్నా' అంటూ బిగ్ బి తన బ్లాగులో ఈరోజు పోస్ట్ చేశారు. ఇప్పుడు తన కుటుంబం జాతీయస్ధాయిలో ఏడు అవార్డులను పొందిందని వెల్లడించారు.

"నా తండ్రి: పద్మశ్రీ, పద్మభూషణ్
అర్ధాంగి జయ: పద్శశ్రీ
కోడలు ఐశ్వర్య: పద్మశ్రీ
అమితాబ్: పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్. ఇలా ఒకే కుటుంబంలో ఇంతమంది పద్మ అవార్డులు దక్కించుకోవడం దేశంలో మరెక్కడా లేదేమో" అంటూ బ్లాగ్‌లో బిగ్ బి రాశారు.

English summary
Lauding actor Amitabh Bachchan, West Bengal Chief Minister Mamata Banerjee today said the legendary actor deserves Bharat Ratna and Padma Vibhushan is not enough.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X