వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Dadasaheb Phalke Award : లెజెండ్ అమితాబ్‌కు అత్యున్నత పురస్కారం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Amitabh Bachchan Gets Dadasaheb Phalke Award || అమితాబ్ బచ్చన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డులను పొందిన అమితాబ్ .. సినీరంగంలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందారు. ఇదివరకు పద్మ శ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు కూడా అందుకొన్నారు అమితాబ్ బచ్చన్.

ప్రతిభకు పట్టం ..

ప్రతిభకు పట్టం ..

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అమితాబ్ బచ్చన్‌కు అందజేస్తామని కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. దీంతో అమితాబ్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడో రావాల్సిన అవార్డును .. ఇన్నాళ్లకు వరించిందని పేర్కొన్నారు. మరోవైపు అమితాబ్‌కు భార్య జయబచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

అమితాబ్‌గా మారిన ఇంక్విలాబ్

అమితాబ్‌గా మారిన ఇంక్విలాబ్

అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్.. అంటే విప్లవం వర్థల్లాలి. అతనికి ఈ పేరును తండ్రి హరివంశ్ పెట్టారు. కానీ స్నేహితుల సూచన మేరకు మార్చారు. అమితాబ్ తల్లికి నాటకాలంటే మక్కువ ఎక్కువ. నటించాలని అనుకొన్నారు కానీ .. గృహిణి అయినందున వీలుకాలేదు. ఆమె ప్రభావంతోనే అమితాబ్ సినిమాల్లోకి వచ్చారు. తొలుత చిన్న చితక పాత్రలు చేశారు. ప్రతినాయకుడిగా కూడా చేశారు. 1970 దశకంలో అమితాబ్ స్టార్ డమ్ వచ్చేసింది.

రెండు దశాబ్ధాలపాటు

రెండు దశాబ్ధాలపాటు

జంజీర్, దివార్ సినిమాలతో అమితాబ్ ఓ రేంజ్‌కి ఎదిగారు. 1980 వరకు అంటే రెండు దశాబ్దాలు బాలీవుడ్‌ను ఏలారు. దాదాపు 180 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఉత్తమ నటుడిగా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డు వేడుకల్లోనూ అవార్డులను అందుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారంటే .. అమితాబ్ నటన సామర్థ్యం అర్థమవుతుంది. నటుడిగానే కాకుంగా నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా, టీవీ యాంకర్‌గా తన ప్రతిభను చాటారు.

ఫ్రెంచి పురస్కారం కూడా..

ఫ్రెంచి పురస్కారం కూడా..

2007లో ప్రెంచి దేశం లెగియన్ ఆఫ్ హానర్ పురస్కారంతో అమితాబ్‌ను గౌరవించింది. 2013లో ది గ్రేట్ గేట్స్ అనే సినిమాతో హాలీవుడ్‌లో కూడా నటించారు అమితాబ్. అయితే 1982లో తీసిన కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు అమితాబ్ బచ్చన్. తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చారు అమితాబ్ బచ్చన్. తన స్నేహితుడు రాజీవ్ గాంధీకి మద్దతుగా ప్రచారం చేశారు. అప్పటి యూపీ సీఎం హెచ్ఎన్ బహుగుణకు వ్యతిరేకంగా అలహాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ రాజకీయాల్లో నిలదొక్కుకోలేక మూడేళ్లకే తన పదవీకి రాజీనామా చేశారు.

English summary
Amitabh Bachchan honoured Dadasaheb Phalke Award. union mimister prakash javadekar announe award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X