వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిపావళి ముందే జయలలిత డిశ్చార్జ్ ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ఈనెల 27వ తేదిన అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. జయలలిత ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుందని అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు.

ఆనారోగ్యంతో చికిత్స పొందుతున్న జయలలిత త్వరగా కోలుకోవాలని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, హోమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోమని ఇప్పటికే అన్నాడీఎంకే నాయకులు చెప్పారు.

jayalalithaa

జయలలిత ఆరోగ్యంలో మార్పులు రావడం, ఆమె కోలుకోవడంతో అన్నాడీఎంకే నాయకులతో పాటు ఆ పార్టీ నాయకులు, అమ్మ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే అపోలో ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

అన్నాడీఎంకే నాయకులు మాత్రం అమ్మ జయలలిత దీపావళి పండగ ముందే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అంటున్నారు. ఈ విషయాన్నిఆసుపత్రి వర్గాలు అధికారికంగా దృవీకరించవలసి ఉంది. గత వారం రోజుల నుంచి జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.

English summary
AIADMK Sources said CM Jayalalithaa has being doing fine, Amma is fine and she will be Discharged before deepavali the source said. Chief Minister Jayalalithaa, who was admitted to Apollo Hospital in Chennai on September 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X