చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Jayalalithaa: అమ్మా నువ్వే కాపాడు తల్లి, OPS, EPS నివాళులు, హ్యాట్రిక్ కోసం అమ్మ ఆశీర్వాదం !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి 'అమ్మ'జయలలితకు అన్నాడీఎంకే నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత నాలుగవ వర్దంతి సందర్బంగా చెన్నైలోని మెరీనా బీచ్ లోని జయలలిత స్మారక మందిరం దగ్గర తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహ ఏఐఏడీఎంకే నేతలు నివాళులు అర్పించారు. అమ్మా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. మీరే మమ్మల్ని కాపాడాలి, మనం హ్యాట్రిక్ కొట్టాలని పై నుంచి మమ్మల్ని, అన్నాడీఎంకే పార్టీని ఆశీర్వదించండి, అంటూ EPS, OPS జయలలితను వేడుకున్నారు.

GHMC Elections 2020 Results: ఇది ట్రైలర్ మాత్రమే, బాహుబలి కంటే పెద్ద సినిమా ఉంటుంది, కుష్బు !GHMC Elections 2020 Results: ఇది ట్రైలర్ మాత్రమే, బాహుబలి కంటే పెద్ద సినిమా ఉంటుంది, కుష్బు !

 కరోనా నియమాలు

కరోనా నియమాలు

చెన్నై సిటీతో పాటు తమిళనాడులో కరోనా వైరస్ మహమ్మారి ఇంకా శాంతించలేదు. ఏదైనా కార్యక్రమం చేపట్టినా 200 మందికి మించి ఎక్కువ మంది హాజరుకాకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం పాటించింది.

 ఓపీఎస్- ఈపీఎస్ టీమ్ లు

ఓపీఎస్- ఈపీఎస్ టీమ్ లు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం శనివారం చెన్నైలోని మెరీనా బీచ్ లోని జయలలిత స్మారక మందిరం దగ్గరకు చేరుకుని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అప్పటికే అన్నాడీఎంకే నేతలు జయలలిత స్మారక మందిరాన్ని రకరకాల పూలతో అలంకరించారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గంలోని ముఖ్యనేతలు వారి వెంట ఉన్నారు.

 మంత్రులు, ఎమ్మెల్యేలు

మంత్రులు, ఎమ్మెల్యేలు

ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో పాటు తమిళనాడు మంత్రులు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు మాత్రమే అమ్మ స్మారక మందిరం దగ్గరకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. కరోనా నియమాలు పాటిస్తూ చెన్నైలోని మెరీనా బీచ్ లోని జయలలిత స్మారక మందిరం దగ్గర 200 మంది మాత్రమే హాజరై అమ్మకు నివాళులు అర్పించారు.

అమ్మా నువ్వే కాపాడు తల్లి

అమ్మా నువ్వే కాపాడు తల్లి

2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచి అధికార అన్నాడీఎంకే పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ డీఎంకే అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. 9 సంవత్సరాలకు పైగా తమిళనాడులో అధికారంలో తిష్ట వేసిన అన్నాడీఎంకే ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నది. అమ్మా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. మీరే మమ్మల్ని కాపాడాలి, పై నుంచి మమ్మల్ని, అన్నాడీఎంకే పార్టీని ఆశీర్వదించండి అంటూ EPS, OPS జయలలితను వేడుకున్నారు.

English summary
Jayalalithaa: Tamil Nadu Chief Minister Palanisamy, Deputy Chief Minister Panneer Selvam, ministers and AIADMK executives paid their respects at the Jayalalithaa Memorial in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X