వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమ్నెస్టీ కార్యాలయలపై సీబీఐ దాడులు.. విదేశాల నుంచి అక్రమంగా నిధుల మళ్లింపు...

|
Google Oneindia TeluguNews

స్వచ్చంద సంస్థ ఆమ్నెస్టీ కార్యాలయాలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ, బెంగళూరులో ఏకకాలంలో రైడ్స్ చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్-2010 నిబంధనలను ఉల్లంఘించారని సీబీఐ పేర్కొన్నది.

ఈ మేరకు సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరు. ఢిల్లీలో గల ఆమ్నెస్టీ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించిన 13 నెలల తర్వాత సీబీఐ రైడ్ చేసింది.

Amnesty India Offices In Delhi, Bengaluru Raided By CBI

ఆమ్నెస్టీ కార్యాలయం మానవ హక్కుల కోసం పోరాడుతుంది. దేశంలో జరిగే ఘటనలపై స్పందిస్తోంది. అయితే తాము మానవ హక్కుల ఉల్లంఘనపై స్పందించినందుకే సీబీఐ దాడులు చేసిందని కంపెనీ పేర్కొన్నది. అంతర్జాతీయ చట్టం ప్రకారమే భారత్‌లో ఆమ్నెస్టీ సంస్థ పనిచేస్తుందని తెలిపింది. భారతే కాదే ఎక్కడైనా మానవ హక్కుల కోసం పోరాడుతామని చెప్పింది. ఇప్పటిలాగే అదే విలువలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.

విదేశీ నిధులకు సంబంధించి ఆమ్నెస్టీ నిబంధనలను ఉల్లంఘించిందని అధికారులు చెప్తున్నారు. రూ. 36 కోట్లకు సంబంధించి సరైన వివరాలు లేవని పేర్కొన్నది. కార్యాలయంలో ఉన్న అధికారులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆఫీసు నుంచి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

English summary
amnesty india offices in bengalure and delhi have been raided by the cbi over alleged violation of rules invoving foreign funding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X