వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండువేలను ఆమె మోయలేకపోయింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఉత్తర ప్రదేశ్ :రెండువేల నగదును ఓ మహిళ మోయలేకపోయింది. మీరు చదివింది కరెక్టే. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ బ్యాంకు అధికారులు ఇచ్చిన రెండు వేల నగదును మోయలేకపోయింది.పెద్ద నగదు నోట్ల రద్దుతో ఆమెకు కష్టాలు వచ్చాయి.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సర్జుదేవి 60 ఏళ్ళు వయస్సు.ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కొడుకు రామ్ కుమార్ క్యాన్సర్ తో భాదపడుతున్నాడు.ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లక్ష రూపాయాలు ఇచ్చాడు. ఈ డబ్బులతో కొడుకుకు చికిత్స చేయిస్తోంది.

amount two thoursand rupees..weeight 17 kgs

లక్నోకు 25 కిలోమీటర్ల దూరంలోని మోహన్ లాల్ గంజ్ లో ఆమె నివాసం ఉంటుంది. పెద్ద నగదు నోట్ల రద్దు తో ఆమె చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. తన వద్ద ఉన్న నగదును మార్పిడి చేసుకొనేందుకు ఆమె మంగళవారం నాడు బ్యాంకుకు వెళ్ళింది.

తన వద్ద ఉన్న పెద్ద నగదును ఆమె బ్యాంకులో జమచేసింది. వాటికి సమానమైన నగదు కోసం ఎదురు చూస్తోంది.బ్యాంకు అధికారులు ఆమెకు షాక్ ఇచ్చారు. రెండువేల రూపాయాల చిల్లరను ఆమెకు ఇచ్చారు.రెండువేల రూపాయాల విలువైన చిల్లర నాణెలను ఓ బ్యాగులో పోసి ఇచ్చారు బ్యాంకు అధికారులు.ఈ బ్యాగు సుమారు 18 కిలోలుంది. ఈ వయస్సులో ఆ బ్యాగును మోయడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఇంటివద్ద ఉన్న తన కొడుకు పిలిపించి బ్యాగ్ ను ఆమె తీసుకెళ్ళింది.

English summary
sargu devi an 60 years old lady living in mohanlalganj.she went to bank on tuesday for exchange of old currency.bank employees give to surg devi 2000 rupees of coins.coins weighe around 17 kgs. sargu devi pickupe this bag with her son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X