వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదేం రిస్కీ కాదు, అలా భావిస్తే సారీ: క్రూయిజ్ నౌక అంచున సెల్ఫీపై ఫడ్నవీస్ భార్య

|
Google Oneindia TeluguNews

Recommended Video

సముద్రంలో నౌక అంచున సీఎం భార్య అమృత సెల్ఫీ

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ క్రూయిజ్‌షిప్‌లో భద్రతా హెచ్చరికలు ఉల్లంఘించి ఓడ చివరకు వెళ్లి సెల్ఫీ తీసుకోవడంపై చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం ఆమె స్పందించారు. తాను తప్పు చేసినట్లుగా ఎవరైనా భావిస్తే అందుకు క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాడాట్లాడారు.

సముద్రంలో నౌక అంచున సీఎం భార్య అమృత సెల్ఫీ: సెక్యూరిటీకి ముచ్చెమటలు (వీడియో) సముద్రంలో నౌక అంచున సీఎం భార్య అమృత సెల్ఫీ: సెక్యూరిటీకి ముచ్చెమటలు (వీడియో)

అసలు తాను కూర్చున్న ప్రాంతం ప్రమాదకరమైనది ఏమీ కాదని చెప్పారు. తాను కూర్చొని సెల్ఫీ తీసుకున్న ప్రాంతం ప్రమాదకరమైన స్థలం ఏమీ కాదని, తాను కూర్చున్న దాని కింద మరో రెండు మెట్లు ఉన్నాయని, అయినప్పటికీ తాను చేసింది తప్పని ఎవరైనా భావిస్తే క్షమాపణ కోరుతున్నానని చెప్పారు.

Amruta Fadnavis takes risky selfie on ship in Mumbai, apologises

ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకునే దుస్సాహసం చేయవద్దని అమృత యువతకు విజ్ఞప్తి చేశారు. తాను మరీ ప్రమాదకరంగా ఉండేలా సెల్ఫీ దిగలేదని స్పష్టం చేశారు.

అమృతా ఫడ్నవీస్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆంగ్రియా క్రూయిజ్ నౌక అంచు భాగంలో కూర్చోగా భద్రతా సిబ్బంది ఆమెను తిరిగి వచ్చేయాలని సూచించారు. ఆమె మాత్రం తన స్మార్ట్ ఫోన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

English summary
"If anyone thinks I have made some mistake, then I apologise for it," Amruta Fadnavis said. She also cautioned the youth to "not take excessive risk to take a selfie."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X