చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణ అంత్యక్రియల్లో తెల్లటి సల్వార్‌లో ఆముధ: ఆమె గురించి చర్చ, ఎవరామే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలకు ఐఏఎస్ అధికారిణి ఆముధ ఇంచార్జ్‌గా వ్యవహరించారు. కలైంజ్ఞర్ అంత్యక్రియల సందర్భంగా ఆమె తెల్లని దుస్తులు ధరించి హడావుడిగా కనిపించింది. దీంతో అందరి దృష్టి ఆమెపై పడింది. ఆమె ఎవరు, అంత్యక్రియల వద్ద ఆమె పాత్ర ఏమిటనే విషయం చర్చనీయాశంగా మారింది. ఆమెనే ఐఏఎస్ ఆముధ.

కరుణ అంత్యక్రియల సమయంలో ఆమె ఏం చేయాలనే విషయం అంతకుముందు ఉదయం ఎనిమిది గంటలకు సమాచారం ఇచ్చారు. అప్పటికి ఇంకా అంత్యక్రియలు ఎక్కడ చేయాలో నిర్ణయం కాలేదు. ఎందుకంటే మెరీనా బీచ్‌లో వద్దని ప్రభుత్వం చెప్పగా, డీఎంకే కోర్టుకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో మెరీనా బీచ్‌లోనే అంత్యక్రియలకు కోర్టు అనుమతిచ్చింది.

ఆ రోజు ఉదయం ఆమె రోల్ తెలిసింది

ఆ రోజు ఉదయం ఆమె రోల్ తెలిసింది

కాబట్టి ఆమెకు ఉదయం ఎనిమిది గంటలకు ఆమె రోల్ ఏమిటో చెప్పినప్పటికీ అంత్యక్రియలు ఎక్కడ అనే విషయం తెలియదు. దీంతో తొలుత ప్రభుత్వం చెప్పినట్లుగా మాజీ సీఎంలకు ఇచ్చే చోట అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైకోర్టు తీర్పుతో స్థలం మెరీనాకు మారింది. మెరీనాలోని అంత్యక్రియలు నిర్వహించే చోటుకు ఎంతమందిని లోపలకు అనుమతించవచ్చు.. ఎంతమంది వస్తారనే లెక్కలు వేశారు.

కరుణ ఫ్యామిలీతో ఇంటరాక్ట్

కరుణ ఫ్యామిలీతో ఇంటరాక్ట్

ఆముధ ఆధ్వర్యంలో మెరీనా బీచ్ పరిసర ప్రాంతాలను మొత్తం క్లియర్ చేశారు. ఆమె నిత్యం డీఎంకే నేతలతో సంప్రదింపులు జరిపి, ముందుకు సాగారు. కరుణానిధి పార్థివదేహాన్ని ఖననం చేయడానికి ముందు మెరీనా బీచ్‌లో ఆయన కుటుంబ సభ్యులు అందరూ నివాళులు అర్పించారు. ఈ సమయంలో వారి వెంట ఆమె ఉన్నారు. కరుణనిధి ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరితో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు.

కరుణ ఫ్యామిలీకి ప్రోటోకాల్ గురించి చెప్పగా

కరుణ ఫ్యామిలీకి ప్రోటోకాల్ గురించి చెప్పగా

దీనిపై ఆమె మాట్లాడుతూ.. ఆ సమయం ఎంతో బావోద్వేగంతో కూడుకున్నదని, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్‌ను అర్థం చేసుకున్నామని, అలాంటి సమయంలో మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్ అని, కానీ కరుణ కుటుంబ సభ్యులు సహకరించారని, గన్ క్యారేజ్‌కు ముందు వారికి తాను ప్రోటోకాల్ వివరించానని, వారు తాను చెప్పినట్లే చేశారని ప్రశంసించారు.

 కరుణానిధి గురించి ఆముధ

కరుణానిధి గురించి ఆముధ

కరుణానిధి గురించి ఆముధ మాట్లాడుతూ.. ఆయన అందరి నేతలను గౌరవించే వ్యక్తి అని చెప్పారు. ఆయన హయాంలో తాను సబ్ కలెక్టర్‌గా ప్రమోట్ అయ్యానని చెప్పారు. ఆ తర్వాత కలెక్టర్‌ను అయ్యానని తెలిపారు. అతని పట్ల తాను ఎప్పుడూ గౌరవ భావంతో ఉంటానని చెప్పారు. కాగా, కాంచీపురం కలెక్టర్‌గా ఆముధ అందరి మన్ననలు అందుకుంది. ఏం చేసినా తాను నాకు సాధ్యమైనంతగా చేస్తానని ఆమె చెప్పారు. కాగా, కరుణానిధి అంత్యక్రియల్లో ఆమె తెలుపు రంగు సల్వార్ ధరించారు. చివరి వరకు అక్కడే ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరు ఉంది.

English summary
Dressed in a white salwar, a woman was seen running tirelessly giving directions and coordinating things at Anna samadhi on Wednesday evening when the mortal remains of DMK president and former chief minister M Karunanidhi were laid to rest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X