వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి రాహుల్ హగ్: అమూల్ ఫీచర్ ఫొటో మామూలుగా లేదు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమూల్ ఫీచర్ ఫొటో మామూలుగా లేదు!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని శుక్రవారం పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌగలించుకోవడంతోపాటు ఆ తర్వాత కన్ను కొట్టడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

కాగా, ఇలాంటి అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు డైరీ కో-ఆపరేటివ్ సంస్థ అమూల్ ఊరికే ఉండదు కదా! అందుకే ఎప్పటిలాగే అమూల్ కూడా ఈ ఘటనను ఎంతో ఆసక్తికరంగా రూపొందించింది. ఇప్పుడు అమూల్ వేసిన సెటైరికల్ ఫీచర్ ఇప్పుడు నెటిజన్లు అమితంగా ఆకట్టుకుంటోంది.

రాహుల్, మోడీని కౌగిలించుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. 'ఆలింగనంగా ఉందా? లేక ఇబ్బందికరంగా ఉందా?' అంటూ ఓ ఫొటోను విడుదల చేసింది. అంతేగాక, అందులోనే రాహుల్ గాంధీ కన్నుకొట్టడాన్ని కూడా స్కెచ్ వేసింది. కరెంట్ టాపిక్స్‌తో అమూల్ విడుదల చేసిన అనేక క్రియేటివ్ పిక్చర్స్ ఇప్పటికే ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.

Amul features Rahul Gandhi’s ‘impromptu’ hug to PM Modi, Twitterati praise their wit and sarcasm

'అమూల్ హగ్స్ బ్రెడ్ డైలీ' అనే కొటేషన్ కూడా ఇవ్వడంతో మరింత ఆకర్షణీయంగా ఈ ఫీచర్ ఫొటో ఉంది. తమ ఉత్పత్తుల ప్రమోషన్ చేయడంలో అమూల్‌ను మించిన వారు లేరంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా, రాహుల్, మోడీపై వేసిన ఈ ఫీచర్ ఫొటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. అంతేగాక, అమూల్ ఫీచర్ ఫొటోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలతో ముంచుతున్నారు.

English summary
The no-confidence motion proceedings in Lok Sabha, which concluded late Friday evening, was not bereft of dramatic scenes. However, what stole the show was the ‘impromptu’ hug that Congress president Rahul Gandhi gave Prime Minister Narendra Modi after giving his speech. When unusual events like these happen, Dairy cooperative Amul almost always has a satirical take on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X