వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

40 ఏళ్ల అనుభ‌వం: అయినా త‌ర‌చూ అదృశ్యం: నాడు అండ‌మాన్‌, నేడు అరుణాచ‌ల్‌!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భార‌త వైమానిక ద‌ళానికి చెందిన ఆంటొనోవ్ - 32 ర‌కానికి చెందిన తేలిక‌పాటి విమానం అదృశ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపింది. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌గ‌న‌త‌లంలో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మాయ‌మైంది. వాయుసేన‌లో కీల‌క ప్ర‌దేశాల్లో జ‌వాన్లు, నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను త‌ర‌లించ‌డానికి వినియోగించే ఈ విమానం ఉన్న‌ట్టుండి గ‌ల్లంతు కావ‌డం అనేక అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. చైనా స‌రిహ‌ద్దుకు అత్యంత స‌మీపంలో ఇది గ‌ల్లంతు కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

నాలుగు దశాబ్దాల నుంచీ వాయుసేనలో..

నాలుగు దశాబ్దాల నుంచీ వాయుసేనలో..

ఆంటొనోవ్-32 ఎయిర్‌క్రాఫ్ట్ వైమానిక ద‌ళంలో 40 సంవ‌త్స‌రాల‌కు పైగా అనుభ‌వం ఉంది. దాదాపు నాలుగు ద‌శాబ్దాల నుంచీ ఈ ర‌కం విమానాల సేవ‌ల‌ను వినియోగించుకుంటోంది వాయుసేన‌. 40 సంవ‌త్స‌రాల కింద‌ట తొలిసారిగా దీన్ని వాయుసేన‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక‌ప్ప‌టి సోవియ‌ట్ ర‌ష్యా ఈ ర‌కం విమానాలను రూపొందించింది. డ‌బ‌ల్ ఇంజిన్ ఉండ‌టం దీని ప్ర‌త్యేక‌త‌. సాధార‌ణంగా ఈ ర‌కం విమానాల్లో రెండు ఇంజిన్లు ఉండ‌టం అరుదు.

క్లిష్ట ప్రదేశాల్లో సునాయాసంగా..

క్లిష్ట ప్రదేశాల్లో సునాయాసంగా..

భౌగోళికంగా అత్యంత క్లిష్ట‌మైన ప్ర‌దేశాల‌కు సైన్యాన్ని చేర‌వేయ‌డం, వాయుసేన సిబ్బంది ఉండే ప్ర‌దేశాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను త‌ర‌లించ‌డానికి మాత్ర‌మే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ సేవ‌ల‌ను ప‌రిమితం చేశారు. తాజాగా- అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉండే గ‌స్తీ కాస్తోన్న వైమానిక ద‌ళానికి అవ‌స‌ర‌మైన స‌రుకులు, 13 మంది వాయుసేన సిబ్బందిని తీసుకెళ్తూ గ‌ల్లంతైంది.

మేఛుకా సమీపంలో గల్లంతు

మేఛుకా సమీపంలో గల్లంతు

అస్సాంలోని జోర్హాట్ బేస్ క్యాంప్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మేఛుకా గ్రామంలో వైమానిక ద‌ళ అవ‌స‌రాల కోసం నిర్మించిన విమానాశ్ర‌యంలో దిగాల్సి ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 12:25 నిమిషాల‌కు ల్యాండ్ కావాల్సి ఉండ‌గా.. మ‌ధ్యాహ్నం ఒంటిగంట స‌మ‌యంలో ఈ విమానంతో సంబంధాలు తెగిపోయాయిన‌ట్లు గుర్తించారు అధికారులు.

నాడు అండమాన్ వెళ్తూ..

నాడు అండమాన్ వెళ్తూ..

2016లో కూడా ఇదే ర‌కం విమానం గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. చెన్నైలోని తాంబ‌రం బేస్‌క్యాంప్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఆంటొనోవ్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అండ‌మాన్ వెళ్తూ బంగాళాఖాతం గ‌గ‌న‌త‌లంలో అదృశ్య‌మైంది. ఈ విమానం జాడ ఇప్ప‌టికీ తెలియ‌రాలేదు. ఏమైందో తెలియ‌దు. ఇందులో మొత్తం 29 మంది వైమానిక ద‌ళ జ‌వాన్లు, వారి కుటుంబ స‌భ్యులు మ‌ర‌ణించిన‌ట్లుగా ప్ర‌క‌టించారు అధికారులు.

ప్రతికూల పరిస్థితుల్లో రాణించలేకపోతోందా

ప్రతికూల పరిస్థితుల్లో రాణించలేకపోతోందా

అప్పటి నుంచీ దీని సేవలను తరచూ సందేహాలు వ్యక్తమౌతూ వస్తున్నాయి. ఈ రకం ఎయిర్ క్రాఫ్ట్ తప్ప వేరే రకానికి చెందిన విమానాలు సరుకుల రవాణా, సిబ్బంది తరలింపు విషయంలో అంతగా అనుకూలంగా లేకపోవడం వల్ల వైమానిక దళ అధికారులు దీని మీదే ఆధారపడ్డారు. తరచూ దీన్ని అప్ డేట్ చేస్తూ వస్తున్నప్పటికీ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రాణించలేకపోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

English summary
The An-32 is a Soviet-designed twin engine turboprop transport aircraft used extensively by the Indian Air Force for over four decades. Since it joined the IAF fleet, the rugged planes used to ferry people and air-drop supplies have undergone several rounds of upgrades. In 2016, an Indian Air Force An-32 disappeared while flying over the Bay of Bengal after taking off from Chennai for the Andaman and Nicobar Islands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X